గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ బిచ్చగాళ్ల మీద యుద్ధం షురూ చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని బెగ్గర్స్ ఫ్రీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని బిచ్చగాళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించటమే కాదు.. వారికి సంబంధించిన వివరాల్ని పెద్ద ఎత్తున సేకరించారు. ఇలా సేకరించిన సమాచారం ప్రకారం.. నగరంలో మొత్తంగా 14వేల మంది బిచ్చగాళ్లు ఉన్నారని.. వారిలో 98 శాతం మంది నకిలీ బిచ్చగాళ్లుగా మేయర్ బొంతు తేల్చారు.
ఈ బిచ్చగాళ్లు ఏడాదికి రూ.24 కోట్ల టర్నోవర్ చేస్తారని.. వీరి అడుక్కోవటంతో పాటు మనీ లెండింగ్.. వ్యభిచారం.. డ్రగ్స్ లాంటి పాడు పనులు కూడా చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. అందుకే.. బిచ్చగాళ్ల మీద వార్ డిక్లేర్ చేసిన బొంతు.. నిజమైన బిచ్చగాళ్లకు మాత్రం పునరావాసం కల్పిస్తామని చెబుతున్నారు. ఇక.. బిచ్చగాళ్ల సరాసరి ఆదాయం విషయానికి వస్తే.. తక్కువలో తక్కువ వెయ్యి నుంచి రెండు వేల వరకూ ఉందని మేయర్ చెబుతున్నారు.
భిచ్చగాళ్లు లేని నగరంగా మార్చేందుకు వీలుగా గ్రేటర్ ప్రజలెవ్వరూ డబ్బులు ఇవ్వొద్దంటూ బొంతు ప్రచారం మొదలు పెట్టారు. బిచ్చగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అందించాలని కోరుతున్న ఆయన.. కొన్న హెల్ప్ లైన్ల నెంబర్లుకూడా ఇచ్చారు. 9908111355, 9441746906, 9866289793 నెంబర్లకు ఫోన్ చేసి బిచ్చగాళ్ల వివరాలు చెప్పాలంటున్నారు. నిజమైన బిచ్చగాళ్లను ఆదుకునేందుకు.. వారికి అవసరమైన చేయూత ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఈ విషయం మీద మహానగర ప్రజలకు మరింత అవగాహన కలిగేలా భారీఫ్లెక్సీలు.. బ్యానర్లను నగరం నలుదిశల ఏర్పాటు చేయించారు. బెగ్గర్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ సిటీని మార్చాలని భావిస్తున్న బొంతుకు అండగా నగర ప్రజలు ఎంతమేర ఉంటారో చూడాలి.