శ‌బ‌రిమ‌ల ఎపిసోడ్‌ లో మీడియాకు షాక్‌.. స్వ‌యంకృత‌మేనా?

Update: 2019-01-05 04:58 GMT
న్యాయం.. ధ‌ర్మం.. స‌త్యం లాంటి మాట‌ల్ని అలవోక‌గా మాట్లాడేయ‌టం చాలామందిలో చూస్తుంటాం. కానీ.. వీటి లోతుల్లోకి వెళుతున్న కొద్దీ మాట‌లు త‌గ్గి.. మౌనం పెరిగే ప‌రిస్థితి. నిజానికి ఇవన్నీ కాల మాన ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు.. చూసేవారికి త‌గ్గ‌ట్లు  మారుతూ ఉంటాయి. ప్ర‌జాస్వామ్య భార‌తంలో విషాద‌క‌ర‌మైన అంశం ఏమంటే.. మెజార్టీ వ‌ర్గీయులు త‌మ సెంటిమెంట్ల‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే వారిని మూర్ఖులుగా.. కాలం చెల్లిన సంప్ర‌దాయ‌వాదులుగా.. ఇంకా చెప్పాలంటే రాతి యుగం నాటి వారిగా ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేస్తారు. వారిని త‌ప్పు ప‌డుతూ.. ప్ర‌గ‌తిశీల భావ‌న‌లు ఎందుకు ఉండ‌వంటూ ఎట‌కారం చేస్తారు.

స‌ర్లే.. ప్ర‌గ‌తిశీల భావ‌న‌లు ఏమైనా విశాల దృక్ఫ‌ధంతో పాటు.. ధ‌ర్మ కాంటాం మాదిరి ఉంటాయా? అంటే అది ఉండ‌దు. మెజార్టీల‌ను టార్గెట్ చేసేలా ఉండ‌టంతో పాటు.. వారి విష‌యంలో వెలెత్తి చూపించే అంశాలు.. మ‌రికొంద‌రి విష‌యాల్లో అలాంటివేమీ ఉండ‌వ‌న్న‌ట్లుగా వాదించ‌టం ఈ దేశంలోని మేధావుల‌కు ఒక అల‌వాటుగా మారింది.
ఏ విష‌య‌మో ఎందుకు?  శ‌బ‌రిమ‌ల ఎపిసోడ్‌ నే చూద్దాం. రాష్ట్రంలో మ‌రే స‌మ‌స్యా లేన‌ట్లుగా.. సుప్రీం తీర్పును యుద్ధ ప్రాతిప‌దిక‌న‌.. అమ‌లు చేయ‌కుంటే కొంప‌లు ఆరిపోతాయ‌న్న‌ట్లుగా విజ‌య‌న్ స‌ర్కారు ప‌డుతున్న ఆరాటం స్వామి భ‌క్తుల్ని క‌లిచి వేస్తోంది. కోట్లాది మంది సెంటిమెంట్ల విష‌యంలో తాము ఎన్నుకున్న ప్ర‌భుత్వం ఇంత నిర్ద‌య‌గా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆవేద‌న ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంస్కృతి.. సంప్ర‌దాయాల‌కు ర‌క్ష‌కుడిగా చెప్పుకునే బీజేపీ నేత‌లు రాష్ట్రంలో ఒక‌లా.. కేంద్రంలో మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌టం వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌టంతో పాటు.. విజ‌య‌న్ మొండిత‌నాన్ని రాజ‌కీయం చేసి కేర‌ళ‌లో పాగా వేయ‌టానికి త‌గిన స‌మ‌యంగా భావిస్తున్నారే త‌ప్పించి.. శ‌బ‌రిమ‌ల అంశం కోట్లాది మంది భ‌క్తుల సెంటిమెంట్ల‌కు సంబంధించిన అంశంగా చూడ‌క‌పోవ‌టం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. దేశంలో ఎన్ని గుడులు లేవు.. మ‌రెన్ని ప్రార్థ‌నాల‌యాలు లేవు. ఎవ‌రికి వారు.. వారికి త‌గ్గ‌ట్లుగా రూపొందించుకున్న క‌ట్టుబాట్ల‌ పై క‌త్తి దూయాల్సిన అవ‌స‌రం ఏముంది? ఒక్క గుడిలోకి మ‌హిళ‌ల్ని.. అందులోనూ ప‌దేళ్ల కంటే పెద్ద‌.. యాభై ఏళ్ల కంటే చిన్నోళ్ల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌రు త‌ప్పించి.. మిగిలిన వ‌య‌స్కుల్లోని మ‌హిళ‌ల్ని అనుమ‌తించే విష‌యంలో మ‌హిళ‌ల స‌మాన‌త్వం.. వారి హ‌క్కులు అంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉందా?

పిడికెడు మంది మ‌హిళ‌ల కోసం కోట్లాది మంది మ‌హిళ‌లు వ‌ద్దంటున్న వైనాన్ని ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఈ విష‌యంలో అటు రాజ‌కీయ పార్టీలు.. ఇటు మేధావుల‌తో పాటు.. మీడియా సైతం త‌మ బాధ‌ను.. ఆవేద‌న‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఉంది. మెజార్టీ ప్ర‌జ‌లు కోరుకున్నట్లుగా మీడియా విష‌యాల్ని చూపించ‌కున్నా.. న్యాయంగా.. ధ‌ర్మ‌బ‌ద్ధంగా శ‌బ‌రిమ‌ల అంశంలో వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్న భావ‌న పెద్ద ఎత్తున వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే.. తాజాగా శ‌బ‌రిమ‌ల ఎపిసోడ్‌ను క‌వ‌ర్ చేస్తున్న ఒక మ‌హిళా కెమెరామ‌న్ ప‌ట్ల అనుచితంగా వ్య‌వ‌హ‌రించ‌టానికి కార‌ణ‌మైంద‌ని చెప్పాలి.

ఇవాల్టికి మీడియా సంస్థ‌ల్లో కీల‌క స్థానాల్లో ఉన్న వారిలో ఎక్కువ‌మంది వామ‌ప‌క్ష భావ‌జాలం నిండుగా నింపుకున్నోళ్లే ఎక్కువ‌. అదే విష‌యాన్ని చెప్ప‌టానికి సంకోచించాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని చెప్పాలి. త‌మ భావ‌జాలానికి ఏ మాత్రం స‌రిప‌డ‌ని.. అయ్య‌ప్ప ఆల‌యంలోకి నిర్ణీత వ‌య‌స్కుల్ని అనుమ‌తించ‌ర‌న్న అంశానికి జ‌నం ఏమ‌నుకుంటున్నారు?  వారి వాద‌న‌లో ప‌స ఎంత అనే దాని కంటే కూడా.. వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న కొంద‌రికి త‌గ్గ‌ట్లుగా.. వారు డిసైడ్ చేసిన ప్ర‌యారిటీల్లో వార్త‌లు రావ‌టాన్ని జీర్ణించుకోలేని ప‌రిస్థితి. కొన్నేళ్లుగా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న ఆవేద‌న‌తో పాటు.. త‌మ ఘోషను ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చూపించ‌టం లేద‌న్న కోపం చాలామందిలో ఉంది. అదే.. తాజా మ‌హిళా కెమేరా మ‌న్ కు ఎదురైన చేదు అనుభ‌వంగా చెప్ప‌క త‌ప్పదు. ఇప్ప‌టికైనా మీడియా క‌ళ్లు తెర‌వాల్సిన అవ‌స‌రం ఉంది. లేని ప‌క్షంలో మ‌రిన్ని ఎదురుదెబ్బ‌లు త‌గిలే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది.




Full View


Tags:    

Similar News