కరోనాతో యూరప్ అల్లకల్లోలమవుతోంది. ఇటలీ, స్పెయిన్ లలో అయితే మరణ మృదంగం వాయిస్తోంది. బ్రిటన్ లోనూ ఏకంగా ప్రధాని బోరిస్ కే కరోనాసోకి ఆయన చికిత్స పొందుతున్నారు. వందలాది మందికి వ్యాధి సోకి అల్లాడుతున్నారు. వైద్య పరికరాలు లేక, చికిత్స చేయలేక వైద్యులు చేతులెత్తేస్తున్న పరిస్థితి. దీంతో బ్రిటన్ లో ఇప్పుడు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది.
ఇంగ్లండ్ వాసుల కోసం మిస్ ఇంగ్లండ్ భాషా ముఖర్జీ తన మోడలింగ్ ను సైతం పక్కన పెట్టి డాక్టర్ గా మారారు. దేశంలో ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో ఆమె మళ్లీ వైద్యవృత్తిలోకి మారడం కలకలం రేపుతోంది.
భాషా ముఖర్జీ వైద్యశాస్త్రంలో డిగ్రీ చేసి డాక్టర్ గా మారారు. శ్వాసకోశ వైద్యంలో ఎంఎస్ కూడా చేశారు. అయితే మోడలింగ్ రంగంపై ఆసక్తితో వైద్య వృత్తి వదిలి మిస్ ఇంగ్లండ్ గా కిరీటం గెలిచింది. ఈమె ప్రవాస భారతీయురాలు. 2019లో జూనియర్ వైద్య వృత్తినుంచి విరామం తీసుకున్నారు. ఆఫ్రికాలో వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
ప్రస్తుతం బ్రిటన్ లో పరిస్థితి దిగజారిన వేళ లికంన్ షైర్ లోని పిల్గ్రిమ్స్ ఆసుపత్రి లో వైద్యుడిగా భాషా ముఖర్జీ చేరారు. కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నారు.
నా సేవలు, నేను నేర్చుకున్న వైద్య వృత్తిని దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఉపయోగించడం నాకు గర్వంగా ఉందని.. కరోనా వైరస్ పై పోరాడుతానని భాష ముఖర్జీ తెలిపారు. ఇలా ప్రముఖ మిస్ ఇంగ్లండ్ ఏకంగా దేశం కోసం మళ్లీ వైద్యవృత్తిలోకి రావడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.