పోటీ ఏదైనా గెలుపు గెలుపే. అందులోకి మిస్ యూనివర్స్ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో తమ దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఫైనల్స్ కు వచ్చారంటే.. ఆ దేశ ప్రజలంతా ఎంతో ఉద్వేగంతో తుది ఫలితం కోసం ఎదురు చూస్తుంటారు. ఒకవేళ తమ దేశం నుంచి ప్రాతినిద్యం చేస్తున్న వారు ఓడిపోతే.. తామే ఓడిపోయినంతగా ఫీలయ్యేవారు చాలామందే ఉంటారు. ఇంతటి భావోద్వేగాలుండే పోటీల్లో తప్పులు దొర్లితే జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటి వివాదమే మిస్ యూనివర్స్ విజేత విషయంలో చోటు చేసుకుంది.
తొలుత మిస్ కొలంబియాను విజేతగా ప్రకటించారు. ఆపై.. ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటం కూడా పెట్టేశారు. నిమిషాల వ్యవధిలోనే.. పొరపాటుగా తాము విజేతను ప్రకటించామని.. తమను క్షమించాలంటూ మరోసారి విజేతను ప్రకటించారు. అప్పటివరకూ రన్నర్ గా ఉన్న మిస్ ఫిలిఫ్పైన్స్ ను విజేతగా ప్రకటించారు. దీంతో.. రన్నర్ విన్నర్ గా.. విన్నర్ రన్నర్ గా మారిపోయి.. క్షణాల్లోనే అంతా మారిపోయిన పరిస్థితి.
ఈ వ్యవహారం నిర్వాహకులు సారీ చెప్పినంత సింఫుల్ గా కొలంబియా దేశ ప్రజలు తీసుకోవటం లేదు. మిస్ యూనివర్స్ విజేతను ప్రకటించే విషయంలో దొర్లిన తప్పు మీద వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వివాదంపై విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతన్నాయి. విన్నర్ ని కాస్తా.. రన్నర్ ను చేయటంపై కొలంబియా ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెత్తిన కిరీటం పెట్టి మరీ వెనక్కి తీసేసుకుంటారా? అని మండిపడుతున్నారు. ఇదంతా కావాలనే చేశారన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు.
మిస్ యూనివర్స్ విజేత వెల్లడి వ్యవహారం రచ్చ రచ్చగా మారిన నేపథ్యంలో.. దీనిపై మిస్ జర్మనీ సారా లోరైన్ రెక్ గళం విప్పారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మిస్ యూనివర్స్ విజేగా మిస్ ఫిలిఫ్పీన్స్ ను ఎంపిక చేయటం తనకు షాకింగ్ గా అనిపించిందంటూ వ్యాఖ్యానించారు. తనతో పాటు.. పోటీలో పాల్గొన్న ఎవరూ కూడా మిస్ యూనివర్స్ టైటిల్ ఫిలిఫ్పైన్ భామకు దక్కుతుందని అనుకోలేదంటూ కుండ బద్ధలు కొట్టారు. తన వరకు తనకు పోటీలో పాల్గొన్న అందరిలో.. మిస్ ఫ్రాన్స్ అసలైన విజేతగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
మిస్ యూనివర్స్ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీలో విజేత పేరును తప్పుగా ఎలా ప్రకటిస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక.. ఈ మొత్తం వ్యవహారంలో సంతోషంగా ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఫిలిఫ్పైన్స్ ప్రజలు మాత్రమే.