ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నేపాల్ విమానం గల్లంతు కావడం ఆందోళనకు గురిచేసింది.. నేపాల్ కు చెందిన విమానం ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. నేపాల్ కు చెందిన మిస్సైన విమానం కూలిపోయింది. పొకారా నుంచి జెమ్ సెమ్ పర్యాటక ప్రాంతానికి బయలు దేరిన విమానం ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ముస్లాంగ్ జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. కొండ భాగాన్ని ఢీకొనడంతోనే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ విమానం ముస్తాంగ్ లోని థసంగ్ పర్వత ప్రాంతాల్లో గుర్తించినట్టు నేపాల్ ఆర్మీ తెలిపింది. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకూ 14 మంది మృతదేహాలను వెలికితీశారు. దాదాపు 100 మీటర్ల పరిధిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఈ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని మీడియా తెలిపింది. ఇందులో 22 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో నలుగురు భారత్ కు చెందిన వారున్నారు.
'తారా ఎయిర్ లైన్స్'కు చెందిన 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం.. ఆదివారం ఉదయం పోఖ్రా నుంచి జమ్సోమ్ కు బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 22 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారని సమాచారం.
ఉదయం 9.55 గంటల ప్రాంతంలో సంబంధాలు తెగిపోయాయని సమాచారం. జెమ్ సమ్ ప్రాంతంలోని ముస్తాంగ్ జిల్లాలోని గగనతలంలో చివరగా విమానం కనిపించిందని.. ఆ తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.
జెమ్ సమ్ జిల్లాలోని ఘాసాలో పెద్ద శబ్ధం వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతానికి సెర్చ్ కోసం హెలిక్యాప్టర్ పంపబడింది. విమానంలో 13మంది నేపాలీలు, నలుగురు భారతీయులు , ఇద్దరు జర్మన్లు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.
పఖోరా నుంచి జెమ్ సమ్ వెళ్తున్న సమయంలోనే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కూలిపోయిందని తాజా తెలిసింది. కొండను ఢీకొట్టడం వల్లే ఈ విమానం కూలిపోయిందని.. అందరూ మరణించినట్టేనని తేల్చారు.