అవకాశాలు అన్నిసార్లు రావు. వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. ఆ విషయంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు విఫలం కాగా.. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక ఆ విషయంలో విజయవంతమైంది. ఎలక్ట్రికల్ కార్ల దిగ్గజం టెస్లా తన ప్లాంట్ ను ఇండియాలో పెట్టాలనుకోవటం తెలిసిందే. ఇందుకు అనువైన ప్రాంతాన్ని కొంతకాలంగా ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గోల్డెన్ ఛాన్సును చేజిక్కించుకోవటం కోసం పలు రాష్ట్రాలు ప్రయత్నించాయి.
కియో కార్ల కంపెనీ ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్నందున.. ఏపీసర్కారు ప్రయత్నిస్తే.. అవకాశం దక్కుతుందన్న వాదన వినిపించింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అద్భుతమైన అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటుందని భావించారు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో వెనుకబడిపోగా.. కర్ణాటక రాష్ట్రం టెస్లా ప్లాంట్ ను తమ రాష్ట్రంలో పెట్టేలా ఓకే చేయించుకున్నట్లుగా చెబుతున్నారు.
తాజాగా ఇదే విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారికంగా ప్రకటించారు. టెస్లా ప్లాంట్ కోసం 75 ఏళ్ల వయసులో ఉన్న యడ్డీ ప్రయత్నించి విజయం సాధిస్తే.. నలభై ల్లో ఉన్న జగన్.. అరవైల్లో ఉన్న కేసీఆర్ లకు మాత్రం సాధ్యం కాలేదు. వాస్తవానికి టెస్లా ప్లాంట్ తెలంగాణతో పోలిస్తే.. ఏపీకే ఎక్కువగా వచ్చే వీలుంది. కియా ప్లాంట్ ఉండటంతో.. ఏ మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించినా.. టెస్లా ఏపీకి వచ్చి ఉండేదన్న మాట వినిపిస్తోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా పర్యటనలో టెస్లా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఏపీ గురించి ప్రజంటేషన్ ఇవ్వటంతో పాటు.. తమ రాష్ట్రానికి వస్తే జరిగే మేళ్ల గురించి చెప్పినట్లుగా చెబుతారు. అప్పట్లో ఏపీకి టెస్లా ప్రతినిధి టీంను పంపుతామని చెప్పారని.. తర్వాత ఫాలో అప్ చేయటంతో ఏపీకి పక్కనే ఉన్న కర్ణాటకకు వెళ్లిపోయినట్లుగా చెప్పక తప్పదు. ఏమైనా.. బంగారు అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు చేజార్చుకున్నాయనే చెప్పాలి.