ఊస్టింగ్‌ మంత్రుల ఫైరింగ్ చూశారా?

Update: 2016-06-20 16:11 GMT
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మంత్రి వర్గం నుంచి పద్నాలుగు మంది మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. పదవీచ్యుతులైన వారిలో ఎమ్మెల్యే ఎమ్‌ హెచ్ అంబరీష్ కూడా ఉన్నారు. అయితే తనను పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా ఇవాళ అంబరీష్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ కు పంపించనున్నట్టు తెలుస్తోంది. మిగతా పదవీచ్యుత‌ మంత్రులు కూడా రాజీనామా బాట పట్టినట్టు సమాచారం.

కాగా, మొత్తం 34 మంది మంత్రుల్లో 14 మందిని సీఎం సిద్దరామయ్య తొలగిస్తూ చేసిన సిఫారసు మేరకు గవర్నర్ వాజుభాయ్ వాలా ఆమోదం తెలిపారు. తొలగింపబడిన మంత్రుల్లో అంబరీష్‌ తోపాటు ఖమరుల్ ఇస్లాం - శామ్నూర్ శివశంకరప్ప - వి.శ్రీనివాస్ ప్రసాద్ - ఎమ్‌ హెచ్ అంబరీష్ - వినయ్ కుమార్ సొరకే - సతీష్ జర్ఖోలీ - బాబురావు - శివరాజ్ సంగప్ప - ఎస్‌ ఆర్ పాటిల్ - మనోహర్ తహసీల్దార్ - అభయచంద్ర జైన్ - దినేష్ గుండురావు - కిమ్మనే రత్నాకర్ - పీటి పరమేశ్వర్ నాయక్ ఉన్నారు. వీరిలో కొందరు నిర‌స‌నలు మొద‌లుపెట్ట‌గా మ‌రికొంద‌రు అధిష్టానం బాట‌ప‌ట్టారు.
Tags:    

Similar News