రోహిణి సింధూరి .. లేడీ సింగం. కర్ణాటక కేడర్ తెలుగు ఐఏఎస్ అధికారిణి, ఎదుట ఎవరున్నా కూడా భయానికి మీనింగ్ తెలియని ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ అధికారిణిగా దేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రోహిణి సింధూరి పై ఓ ఎమ్మెలే పరువు నష్టం దావా వేశాడు. మైసూరు జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి పై అదే జిల్లాకు చెందిన జేడీఎస్ పార్టీ మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే సారా మహేష్ వంద రూపాయల పరువు నష్టం దావా వేయటం కర్ణాటక రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. మైసూరు జిల్లాధికారిగా వ్యవహరించిన రోహిణి సింధూరిపై అదే జిల్లాకు చెందిన జేడీఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సారా మహేశ్ రూ.100లకు పరువునష్టం కేసు వేశారు. ప్రస్తుతం ఆమె దేవాదాయ శాఖకు బదిలీ అయింది.
మైసూరు జిల్లా కలెక్టర్ గా రోహిణి సింధూరి ఉన్న కొన్ని నెలల పాటు అనేక వివాదాలు చెలరేగాయి.సారా మహేష్ కు, రోహిణి సింధూరి కి మధ్య వివాదాలు కోర్టుల దాకా చేరాయి. చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు 24 మంది మృతి చెందిన ఘటనకు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి కారకురాలు అని సారా మహేష్ గతంలో ఆరోపణలు చేశారు. ఆక్సిజన్ చేరవేయడంలో జాప్యం చేయడం వల్లనే వారు చనిపోయారని సారా మహేష్ అన్నారు. ఇక ఈ వివాదం పై ఇద్దరూ రిటైర్డ్ న్యాయమూర్తుల విచారణలో కోవిడ్ బాధితుల మృతి ఘటనకు, మైసూరు జిల్లా అధికారి రోహిణి సింధూరికి ఏ విధమైన సంబంధం లేదని తేల్చి చెప్పారు.ఈ క్రమంలో రోహిణి సింధూరి పై ఆరోపణలు చేసిన సారా మహేష్ జిల్లా ప్రజలకు, అధికారులకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత వరుస వివాదాలు వారిద్దరి మధ్య కొనసాగుతూనే ఉన్నాయి.
ఆ తర్వాత సారా మహేష్ కు చెందిన కళ్యాణమండపం రాజ కాలువపై ఉందని జిల్లా అధికారి హోదాలో రోహిణి సింధూరి దానిపై దర్యాప్తు చేయించారు. అయితే , రెవెన్యూశాఖ పరిశీలనలలో అక్రమాలు చోటు చేసుకోలేదని తేలింది. దీనికి తోడు పదేళ్ళుగా సారా మహేశ్ తో పాటు ఆయన భార్యకు చెందిన ఆస్తులను విచారించాలని రోహిణి సింధూరి మైసూరు అభివృద్ధి ప్రాధికారకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రచ్చ మరింత కాక రేపుతోంది.