'మోదుగుల' దూరం... ఆలీకి ఖాయం..!

Update: 2019-03-03 08:52 GMT
ఎప్పుడు.. ఏ సమయంలో పార్టీ నుంచి నేతలు బయటపడుతారో చెప్పలేని పరిస్థితి ఎదురైంది టీడీపీలో. పార్టీలో సంయమనంగానే వ్యవహరిస్తూ ఒక్కసారిగా గుడ్‌ బై చెబుతుండడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతింటున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలను కోల్పోయిన పసుపు పార్టీ తాజాగా మరో ఎమ్మెల్యే దూరం కావడంతో ఆందోళన చెందుతోంది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గైర్హాజరవడం ఆయన పార్టీని వీడుతారనే సంకేతాలకు బలం చేకూరుతోంది.

సినీ నటుడు ఆలీకి టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆయనకు గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం ఇచ్చే అవకాశం ఉందని ఇటీవల వార్తలు జోరుగా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆయనకు ఎక్కడా సీటు కన్ఫామ్‌ చేయలేదు చంద్రబాబు. ఈ వ్యవహారంతో పాటు పార్టీలో తనకు విలువ లేకుండా పోయింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే  మోదుగుల వేణుగోపాలరెడ్డి  కొన్ని నెలల నుంచి పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగానే ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా పాల్గొనలేదు.

మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇప్పటికే పార్టీ మారుతారని కొందరు చర్చించుకున్నారు. కానీ ఆయన ఎలాంటి ప్రకటన చేయకుండా ఇలా టీడీపీకి దూరంగా ఉండడంపై కచ్చితంగా పార్టీని వీడుతారని తెలుస్తోంది. మరోవైపు ఆయన ఇదివరకు వైసీపీ అధినేత జగన్‌కు కలిసినట్లు సమాచారం. ఇటీవల జగన్‌ లండన్‌ వెళ్లినప్పుడు వైసీపీలో చేరడం ఖాయమేనన్నారు. కానీ తిరిగి వచ్చిన తరువాత ఫ్యాన్‌ గుర్తు కిందకు వెళ్తారని టీడీపీలో చర్చించుకున్నారు. ప్రస్తుత పరిస్థితో ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది.

ఒకవేళ మోదుగుల వైసీపీలోకి చేరితే సినీ నటుడు ఆలీకి గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గం టికెట్‌ కన్ఫామ్‌ కానుంది. అయితే సినీయర్‌ నాయకుడైన మోదుగులు వైసీపీలో చేరి పోటీ చేస్తే.. ఆయనపై కొత్తగా పోటీ చేసే ఆలీ విజయం సాధిస్తాడా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.


Tags:    

Similar News