సర్పంచ్ గా మారిన కడప జిల్లా మాజీ ఎమ్మెల్యే !

Update: 2020-03-11 14:00 GMT
కొండూరు ప్రభావతమ్మ .. కడప జిల్లా వాసులకి పరిచయం అక్కర్లేని పేరు. కడప జిల్లా రాజకీయ చరిత్రలో తోలి మహిళా ఎమ్మెల్యే ఈమె కావడం విశేషం. చిన్నతనం నుండే రాజకీయాలపై మక్కువ ఎక్కువగా ఉండటంతో రాజకీయాల వైపు అడుగువేసి ప్రభావతమ్మ ..రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 8 పదుల వయసులోనూ ఆమె ప్రస్తుతం చురుగ్గా తిరుగుతున్నారు. 1972 నుంచి ఇప్పటివరకు జిల్లా రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

కొండూరు ప్రభావతమ్మ ..మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా ..రాజంపేట ఎమ్మెల్యే గా మూడుసార్లు విజయం సాధించారు. మొట్టమొదటిసారిగా 1978లోరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రభావతమ్మ మరోసారి బరిలో నిలిచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ 1983 లో రాజంపేట నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రభావతమ్మ, టీడీపీ అభ్యర్థి సభాపతిపై గెలుపొందారు. ఇది రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ తరువాత 1989లో కాంగ్రెస్ ఆమెకి టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ లోకి వెళ్లి , టీడీపీ అభ్యర్థిగా పోటీచేసినప్పటికీ విజయం సాధించకలేకపోయారు. చివరగా ఆమె 2004 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలోకి దిగి, టీడీపీ అభ్యర్థి బ్రహ్మయ్య పై సుమారు 24వేల ఓట్లపై చిలుకు మెజార్ టీతో గెలుపొందారు.

ఇకపోతే, ఈమెకి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, ఎమ్మెల్యేగా కొనసాగిన తరువాత కూడా తమ గ్రామం పెనగలూరు మండలం కొండూరు సర్పంచ్‌ గా కొనసాగాల్సి వచ్చింది. 1995-2000 మధ్యకాలంలో ఆమె కొండూరు సర్పంచ్‌ గా పనిచేశారు. ఎమ్మెల్యే గా పనిచేసి , మళ్లీ తిరిగి సర్పంచ్ గా పనిచేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
Tags:    

Similar News