ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న ఎన్నికల పరంపరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసిన కొంతకాలానికే.. శాసన మండలికి సంబంధించి ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి గవర్నర్ కోటాలో ఎంపికయ్యేది కాగా.. మిగిలిన ఆరు మాత్రం ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు. ఎన్నికల ద్వారా ఎంపికైనా.. సురక్షితమైన ఈ పోటీలో నిలిచిన.. మండలి స్థానాన్ని ఇట్టే సొంతం చేసుకోవాలని తపిస్తున్న నేతల లిస్టు భారీగానే ఉందని చెబుతున్నారు.
తాజాగా ఖాళీ అయ్యే ఆరు.. టీఆర్ఎస్ పార్టీవే కావటం.. ఎన్నిక అయ్యే అవకాశం కూడా వారికే ఉండడటంతో గులాబీ పార్టీలో ఈ పదవిని దక్కించుకునేందుకు నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి తోచిన మార్గంలో వారు.. ఎమ్మెల్సీ పదవుల్ని దక్కించుకోవాలన్నదే ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం పదవీకాలం పూర్తి అయ్యే ఆరుగురు సభ్యుల విషయానికి వస్తే..
- మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్
- మాజీ మంత్రి కడియం శ్రీహరి
- ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు
- మాజీ మంత్రి ఫరీదుద్దీన్
- ఆకుల అలిత
ఈ ఆరు కాకుండా గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం జూన్ 16న ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో పదవీ కాలం పూర్తి కానున్న ఎమ్మెల్సీల్లో ఇప్పటికే ఉన్న సిట్టింగుల్లో ఎవరికి మరోసారి అవకాశం దక్కనుందన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం.. తాజాగా పదవుల్ని కోరుతున్న సిట్టింగులంతా సీనియర్లు.. కీలక స్థానాల్లో ఉన్న వారే. మరోవైపు.. ఈ పదవుల కోసం బయట భారీ పోటీ నెలకొంది. అయితే..ఈ ఆరింటిలో కనీసం మూడు స్థానాలు సిట్టింగులకు కేటాయించే వీలుందన్న మాట వినిపిస్తోంది.
మండలి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న గుత్తాకు మరోసారి అవకాశం లభించే వీలుందని చెబుతున్నారు. డిప్యూటీ ఛైర్మన్ నేతితో పాటు మాజీ మంత్రి కడియంకు మరోసారి అవకాశం ఇచ్చే వీలుందంటున్నారు.మిగిలిన మూడింటిని మాత్రం కొత్త వారిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. గవర్నర్ కోటాలో ఖాళీ అయ్యే స్థానాన్ని సీఎం కార్యాలయ ఓఎస్డీగా వ్యవహరిస్తున్న దేశపతి శ్రీనివాస్.. టీఎన్టీ యూనియన్ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ లు ఆశిస్తున్నారు. వాస్తవానికి గతంలో దేశపతికి సీటు కన్ఫర్మ్ కావాల్సి ఉంది. చివరి నిమిషంలో జరిగిన మార్పుతో.. ఆయనకు బదులుగా గోరేటి వెంకన్నను ఎంపిక చేశారు.
ఎమ్మెల్యేల కోటాలోని ఆరు స్థానాల్లో మూడింటిని సిట్టింగులకు కేటాయిస్తే.. మిగిలిన మూడుస్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఎవరికి వారు.. పార్టీ కోసం తాము చేసిన సేవల చిట్టాను ప్రస్తావిస్తున్నారు. పార్టీ పట్ల.. కేసీఆర్ విషయంలో తమకున్న కమిట్ మెంట్ ను గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ మూడు పదవుల్ని ఆశిస్తున్న వారి జాబితాను చూస్తే..
- అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూధనాచారి
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- మాజీ ఎంపీ గుండు సుధారాణి
- మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
- హైదారాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
- పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు
- కరీంనగర్ మాజీ జెడ్పీ ఛైర్ పర్సనర్ తుల ఉమ
- సాగర్ లో టికెట్ ఆశించి భంగపడిన ఎంసీ కోటిరెడ్డి
- హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి టికెట్ ఆశించి మిస్ అయిన పీఎల్ శ్రీనివాస్ తదితరులు
ఇంత భారీగా ఆశావాహుల జాబితా ఉన్న నేపథ్యంలో మూడు స్థానాల్ని ఎవరికి కేటాయిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. కొత్తగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలన్నది కేసీఆర్ కు పెద్ద పరీక్షగా మారినట్లేనని చెప్పక తప్పదు.