ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.. నేతల ప్రచార ఆర్భాటం ప్రజలకు ఇబ్బందులుగా మారుతోంది. దీనిపై ప్రశ్నిస్తే బెదిరింపులు.. అధికారంలో ఉన్నారు కదా అని ప్రజలపై నోరు పారేసుకుంటే ఎలా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఫ్లెక్సీలు రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేసిన వైసీపీ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెదిరించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ప్రజలకు ఇబ్బందులంటూ వాట్సాప్ మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. ఫ్లెక్సీలపై వైసీపీ నేత వీర్రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసి వాట్సాప్ మెసేజ్ లు పెట్టాడు. దీనిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కాళ్లు చేతులు తీసేస్తా అని చెప్పు వాడికి' అంటూ తోట త్రిమూర్తులు ఫోన్ కాల్ లో చేసిన కామెంట్ ఈ వివాదానికి కారణమైంది.
మండపేటలోని అనేక సెంటర్లలో తోట త్రిమూర్తులు ఫ్లెక్సీలు ప్రమాదకరంగా ఉన్నారని వీర్రెడ్డి అనే ఓ కార్యకర్త వాట్సాప్ లో గ్రూప్ చాట్ చేశాడు. స్పందన లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదుచేశారు. ఈ విషయం కాస్తా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు తెలిసింది.
దీనిపై సీరియస్ అయిన తోట.. పట్టణంలోని ఏడో వార్డ్ కౌన్సిలర్ కు చెప్పి వీర్రెడ్డి కాళ్లు చేతులు తీసేస్తా అని వాడికి చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. తోట తాజాగా కౌన్సిలర్ తో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది.దీనిపై తోట స్పందించారు. పార్టీ పరంగా ఏదో క్యాజువల్ గా మాట్లాడిన వాటిని రికార్డ్ చేసి రచ్చ చేస్తున్నాడని.. అంతే తప్ప తాను ఎవరినీ బెదిరించడం లేదంటున్నారు.