ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇవి పార్టీలకు అతీతంగా జరగాల్సి ఉన్నప్పటికీ.. వైసీపీ జోక్యంతో రాజకీయం పెరిగిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. ఇప్పుడు టీడీపీ అసలు సిసలు రాజకీయాలకు తెరదీసింది.
ఎలాగంటే.. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లతో పాటు ఏకంగా 7 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ నెల 23 న జరిగే ఈ పోలింగ్‌పై వైసీపీ ఇప్పటికే ఏడుగురికి టికెట్లు ఇచ్చేసింది. ఎందుకంటే.. సభలో 151 మంది సభ్యుల బలం వైసీపీకి ఉంది. దీంతో గుండుగుత్తగా తామే విజయం దక్కించుకునే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది.
అయితే.. దీనికి అంటే.. వైసీపీ వ్యూహానికి గండి కొడుతూ.. చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీలో చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ తరఫున అభ్యర్థిని బరిలోకి దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా బీసీ(చేనేత వర్గం పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను మండలికి పంపాలని బాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఈ నెల 23న 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగనుండగా.. మార్చి 13న నామినేషన్ల దాఖలుకు గడువుంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం దాదాపు 23 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం ఉంటుంది. టీడీపీకి ప్రస్తుతం 23 మంది సభ్యులు ఉన్నారు. దీంతో చంద్రబాబు.. వ్యూహాత్మకంగా పంచుమర్తికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఇక, పంచుమర్తి అనురాధ విషయానికి వస్తే.. 1995-2000 వరకు విజయవాడ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2009లో మంగళగిరి అసెంబ్లీ టికెట్ను ఆశించారు.
కానీ, దక్కలేదు. పార్టీ అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ద్వారా టీడీపీ బీసీ లపక్షపాతి అని మరోసారి నిరూపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.