తెలంగాణ రాష్ట్రంలో మనుషుల కంటే మొబైల్ కనెక్షన్లు ఎక్కువని తేలింది. తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన తాజా నివేదికలో రాష్ట్రంలో ప్రజల కంటే మొబైల్ కనెక్షన్లు అధికంగా ఉన్న ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాష్ట్రం మొత్తమ్మీదా ఉన్న కనెక్షన్లలో మూడో వంతు హైదరాబాద్ లోనే ఉండటం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3.52 కోట్ల మంది జనాభా ఉండగా.. మొబైల్ కనెక్షన్లు మాత్రం అందుకు భిన్నంగా 3.66 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉండటం గమనార్హం.
మొత్తం 83.03లక్షల కుటుంబాలున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మొబైల్ కనెక్షన్లు హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల్లోనే ఉండటం విశేషం. మొత్తం 3.66 కనెక్షన్లలో.. ఈ రెండు జిల్లాల్లోనే 1.47 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లుగా తేలింది. మొత్తం పది జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ మొబైల్ కనెక్షన్లు (20.4లక్షలు) రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్లుగా తేలింది. ఆ తర్వాతి స్థానం అదిలాబాద్ (21.5లక్షలు) తర్వాతి స్థానం నిజామాబాద్ జిల్లా (22.66లక్షలు) నిలిచింది.
ఇక అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో (1.27 కోట్ల) మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ జిల్లా (36.06 లక్షలు) నిలవగా.. తర్వాతి స్థానంలో వరంగల్ జిల్లాలో (32.62 లక్షలు) మొబైల్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.