మోడీ కూడా వచ్చాడు.. రాహుల్ జాడేదీ.. కాంగ్రెస్ ఇక క్లోజేనా?

Update: 2020-11-29 15:30 GMT
గ్రేట‌ర్ ఫైట్ భీక‌రంగా సాగుతోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. గ్రేట‌ర్‌లో పాగా వేయాల‌ని .. బీజేపీ ఉవ్విళ్లూరుతోం ది. కేసీఆర్ పార్టీ టీఆర్ ఎస్‌కు చెక్ పెట్టి.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇక్క‌డ గ్రేట‌ర్‌ను ద‌క్కించుకుని తీరాల‌నే సం క‌ల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ క్ర‌మంలో స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. స్థానిక ఎన్నిక‌ల‌ను సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఎక్క‌డెక్క‌డి నుంచో నాయ‌కుల‌ను రంగంలోకి దింపుతోంది. ఇప్ప‌టికే  కేంద్రం నుంచి న‌లుగురు మంత్రులు ప్ర‌త్య‌క్షంగా ప్ర‌చారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఏకంగా రెండు రోజుల పర్య‌ట‌న‌తో ప్ర‌చారానికి దిగారు.

ఇక‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా హైదరాబాదులో ఒక పరోక్ష ప్రచారంలా వ్యాక్సిన్ కోసం వచ్చి కనిపించి పోయారు.  ఎక్క‌డా లేని విధంగా.. ఓ స్థానిక ఎన్నికల్లో ప్ర‌ధాని కూడా దృష్టిపెట్టడం బ‌హుశ ఈ దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు.  మ‌రి బీజేపీ ఇంత చేస్తుంటే.. మ‌రో జాతీయ పార్టీ.. తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకొనే పార్టీ.. భ‌విష్య‌త్తులో రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్న పార్టీ.. కాంగ్రెస్‌లో మాత్రం ఏమాత్రం దూకుడు క‌నిపించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్‌ను న‌డిపించాల్సిన భావి ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీలో గ్రేట‌ర్ తాలూకు.. వేడి.. ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం రాహుల్ ఎక్క‌డ ఉన్నారు.. అంటే.. గోవాలో త‌న మాతృమూర్తి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా పాద సేవ‌లో ఆయ‌న ఉన్నారు. ఇలా సేవ చేయడాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. కానీ, అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో ఎదిగేందుకు ఎడ్జ్ ఉన్న స‌మ‌యంలో ఈ వాతావ‌ర‌ణాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సిన స‌మ‌యంలో రాహుల్ ఇలా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం, పార్టీకి ద‌శ దిశ లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం.. పార్టీపై పెను ప్ర‌భావం ప‌డేలా చేసింద‌నడంలో సందేహం లేదు. ఇప్ప‌టికే అంత‌ర్గత కుమ్ములాట‌ల‌తో కునారిల్లిపోయిన కాంగ్రెస్‌.. న‌డిపించే నాథుడు క‌నిపించ‌క‌.. అధిష్టానం నుంచి స‌రైన దిశానిర్దేశం కూడా లేక‌.. గ్రేట‌ర్‌ను చేజేతులా వ‌దిలేసుకుంటున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలా అయితే.. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎలా పుంజుకుంటుందో.. రాహుల్ స్పందిచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు. మ‌రి ఆయ‌న ఎప్ప‌టికి స్పందిస్తారో.. ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News