ఈ విషయంపైనే బీజేపీలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. నరేంద్రమోడి సభలో ఉండగానే చాలామంది ఎంపిలు గైర్హాజరయ్యారన్న విషయం తెలిసి సీనియర్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ పార్టీ సమావేశం లో మోడీ స్పష్టంగా చెప్పేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంపిలు తప్పకుండా సభలకు హాజరవ్వాల్సిందే అని చెప్పారు. సమావేశాలకు హాజరు కాని సభ్యుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంటానని పెద్ద వార్నింగ్ ఇచ్చారు.
మోడీ వార్నింగ్ దెబ్బకు మంత్రులు, ఎంపీలు విధిగా ఇటు లోక్ సభ అటు రాజ్యసభకు హాజరవుతున్నారు. ఏదైనా అవసరం అయి సభకు రాలేకపోతే ముందుగానే ప్రధాని కార్యాలయానికి కానీ లేదా అమిత్ షా కి కాని ఎంపిలు చెబుతున్నారు. నిజానికి ఎంపిలైనా, ఎంఎల్ఏలైనా పార్లమెంటు, అసెంబ్లీలకు విధిగా హాజరు కావాల్సిందే అన్న దాంట్లో రెండో ఆలోచన లేదు.
లక్షలాది రూపాయలను జీతాలుగా తీసుకుంటున్న ప్రజా ప్రతినిధులు సభలకు హాజరై ప్రజాసమస్యలను ప్రస్తావించక పోతే ఇక వాళ్ళ ఉపయోగమేమిటి ? ఇక ప్రస్తుత విషయానికి వస్తే బీజేపీ రాజ్యసభ ఎంపీలు చాలామంది సభలో కనిపించకపోవడంతో మోడీకి మండిపోయింది. తాను సభలో ఉండగానే ఎంపిలు గైర్హాజరవ్వటంపై మోడి తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. దాంతో సభలో ఉండాల్సిన ఎంపిలెంతమంది ? హాజరైన ఎంపిలెంతమంది అనే విషయమై తన అటెండన్సు ఇవ్వాలని ఆదేశించారు.
రాజ్యసభలో అనేక బిల్లులను పాస్ చేసుకునే విషయంలో పెద్ద గొడవ జరిగింది. అలాంటి బిల్లుల్లో ఒకదానిని సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఏ బిల్లునైనా సెలక్ట్ కమిటికి పంపాలంటే అందుకు ఓటింగ్ జరగాల్సుంటంది. ప్రతిపక్షాలు డిమాండ్ కు ఓటింగ్ లో ఎక్కువ ఓట్లుపడితే కమిటికి పంపాల్సిందే. ప్రతిపక్షాల డిమాండ్ పై ఓటింగ్ పెట్టాల్సిన పరిస్ధితి వచ్చింది. చూస్తే సభలో బీజేపీ ఎంపీల హాజరు చాలా పలుచగా ఉందని మోడీకి అర్ధమైపోయిందట.
దాంతో ఏదో కిందా మీద పడి ఓటింగ్ ను వాయిదా వేయించుకున్నారు. ప్రతిపక్షాల పట్టుదల వల్ల ఓటింగ్ అనివార్యమయ్యుంటే కేంద్ర ప్రభుత్వం పరిస్ధితి చాలా దారుణంగా ఉండేది. దాంతో గైర్హాజరైన ఎంపిలందరిపైన మోడికి ఒళ్ళు మండిపోయింది. అందుకనే గైర్హాజరైన ఎంపీల జాబితాను ఇవ్వాలని ఆదేశించారు. పరిస్థితి చూస్తుంటే మోడీ అంటే ఎంపిల్లో భయం పోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకపుడు మోడీ అంటేనే వణికిపోయి సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు ఇపుడు మోడీ సభలో ఉన్నారని తెలిసి కూడా హాజరు కావడం అంటే అర్థమేంటి ?