వ‌ర‌వ‌ర‌రావు అరెస్ట్‌.. ఫూణె త‌ర‌లింపు!

Update: 2018-08-28 10:18 GMT
షాకింగ్ ప‌రిణామం చోటు చేసుకుంది. అభ్యుద‌య భావాలు.. విప్ల‌వ ర‌చ‌యితల సంఘం నేత వ‌ర‌వ‌రరావును ఫూణె పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఆయ‌న్ను అరెస్ట్ చేసిన అభియోగం వింటే షాక్ తినాల్సిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌న్న ఆరోప‌ణ‌పై ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.

వామ‌ప‌క్ష భావ‌జాలం నిండుగా ఉన్న వ‌ర‌వ‌ర‌రావుతో పాటు మ‌రో ఏడుగురి పైనా కేసులు న‌మోదు చేశారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఫూణె నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన పోలీసులు తెలంగాణ పోలీసులు స‌హ‌కారం తీసుకొని వ‌ర‌వ‌ర‌రావు ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించారు. ఇంటికి లోప‌ల నుంచి తాళం వేసి మ‌రీ సోదాలు నిర్వహించారు. దాదాపు ఆయ‌న ఇంట్లో ఎనిమిది గంట‌ల పాటు పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌టం గ‌మ‌నార్హం. వ‌ర‌వ‌ర‌రావుతో పాటు.. మ‌రికొంద‌రు ఇళ్లల్లోనూ సోదాలు నిర్వ‌హించారు.

ఇదిలా ఉంటే.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ‌ర‌వ‌ర‌రావును గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఫూణెకు త‌ర‌లించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. కోర్టుకు హాజ‌రు ప‌రిచి అక్క‌డ నుంచి అనుమ‌తి తీసుకున్నాక ఫూణెకు తీసుకెళ‌తారా?  లేక‌.. నేరుగా తీసుకెళ‌తారా? అన్న దానిపై సందిగ్థ‌త నెల‌కొంది. ఇదిలా ఉంటే.. వ‌ర‌వ‌ర‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనంపై ప్ర‌జాసంఘాలు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్ర‌జాసంఘాల నేత‌లు ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు చేరుకొని పోలీసులు తీరును త‌ప్పు ప‌డుతున్నారు.


Tags:    

Similar News