తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ ఆ తంతు ముగిసిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణసీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ నే ఎత్తి చూపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలును ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో మోడీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టి అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తీరును, కేసీఆర్ ను ఎండగట్టారు.
తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదని మోడీ అన్నారు. కేంద్రం ప్రగతి పనులు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతోందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని.. తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు.
ఇక కేసీఆర్ పాలనను మోడీ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి రాజ్యమేలుతున్నాయని మోడీ అన్నారు. తండ్రి, కొడుకు, కుమార్తె అంతా అధికారంలో ఉంటారు. కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరుగుతోంది. కుటుంబ పాలన అవినీతి వేర్వేరు కాదని అన్నారు. ప్రగతి నిరోధకులు ప్రజల సొమ్ము అవినీతి పరులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని.. డిజిటల్ విధానం ద్వారా దళారీ విధానం లేకుండా చేశామని.. నిజాయితీతో పనిచేసే వారంటూ అవినీతిపరులకు భయం కలుగుతోందని విమర్శించారు.
అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావడం లేదని మోడీ అన్నారు. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్ధా? అవినీతి పై పోరాటం చేయాలా? వద్దా? అవినీతి పరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా? వద్దా? కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మోడీ అన్నారు.
ఈ సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను మోడీ వివరించారు.
-దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించినట్టు మోడీ తెలిపారు.
-తెలంగాణలో రూ.35వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం
-తెలంగాణలో భారీ టెక్స్ టైల్ పార్క్
-తొమ్మిదేళ్లలో భారత్ రూపురేఖలు మార్చాం.
-తెలంగాణలో 11వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం
-హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సేవల విస్తరణ
-హైదరాబాద్ లో ఒక్కరోజే 13 ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి..
-సికింద్రాబాద్-మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులు పూర్తి
-హైదరాబాద్ -బెంగళూరు హైవే అభివృద్ధి
-తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.