అనూహ్యంగా తెర మీదకు వచ్చిన వ్యవహారం ఇప్పుడు అంతకంతకూ ముదురుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక అత్యాచార బాధితురాలిని పరామర్శించిన సందర్భంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ట్విటర్ లో ఒక పోస్టు చేశారు. ఇందులో అత్యాచార బాధితురాలి వివరాలు తెలిసేలా ఉన్నాయన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై జాతీయ బాలల హక్కుల కమిషన్ ట్విటర్ కు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే రాహుల్ ఖాతాను నిలిపివేస్తూ సదరు సోషల్ మీడియా సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
తమ పార్టీ అధినాయకుడి సోషల్ మీడియా ఖాతాను నిలిపివేయటమా? అన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు ఐదు వేల అకౌంట్లను బ్లాక్ చేయటం ఇప్పుడు వివాదంగా మారింది. అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు.. పాలసీకి భిన్నంగా ఉన్నప్పుడు సదరు సంస్థ లేదంటే సదరు వ్యక్తి ఖాతాల్ని బ్లాక్ చేయటం.. తాత్కాలికంగా నిషేధాన్ని విధించటం ట్విటర్ కు కొత్తేం కాదు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇలాంటి చర్యల్ని తీసుకుంది. అదే రీతిలో రాహుల్ ఖాతాను విడిచిపెట్టలేదు. ఇప్పుడు అదే వివాదంగా మారింది.
ఎందుకంటే.. రాహుల్ ఖాతాల్ని నిలిపివేసిన వ్యవహారంలో మోడీ సర్కారు పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తమ చేతిలో అధికారం ఉన్న నేపథ్యంలో.. తమను కట్టడి చేయటానికి ట్విటర్ ను ప్రభావితం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కొత్త ఐటీ చట్టాన్ని అమలు చేసే విషయంలో అభ్యంతరం చెప్పటం ద్వారా ట్విటర్ కు కేంద్రానికి సరైన సంబంధాలు లేకపోవటం తెలిసిందే. ఈ క్రమంలో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు.. ప్రభుత్వానికి తాము అనుకూలంగా ఉన్నామన్న సందేశాన్ని పంపటం కోసమే రాహుల్ అండ్ కో ఖాతాల్ని బ్లాక్ చేశారన్న మాట కాంగ్రెస్ నేతల నోటి నుంచి వస్తోంది.
వాస్తవ కోణంలో చూసినప్పుడు.. ఎవరి ఖాతాలైనా సరే.. ట్విటర్ నిబందనలకు భిన్నంగా ఉన్నంతనే హెచ్చరించటం.. తాత్కాలికంగా సస్పెన్షన్ కు గురి చేయటం మామూలే. ఆ మాటకు వస్తే.. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ను సైతం నిలిపేసిన వైనం తెలిసిందే. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతా విషయంలోనే నిర్మోహమాటంగా చర్యలు తీసుకున్న ట్విటర్ లాంటి సంస్థలు మోడీ సర్కారు చెప్పినంతనే ఇలాంటి పనులు చేస్తారనుకోవటం తప్పే అవుతుందన్న వాదనను బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుతనం.. ట్విటర్ ముందుచూపు లేకపోవటం మోడీ సర్కారుకు ఇప్పుడు ఖాతాల్ని 'బ్లాక్' చేశారన్న మరక అంటుకుందని చెప్పాలి. నిబంధనలకు విరుద్ధంగా పోస్టు ఉందన్న విషయం తమ వరకు వచ్చినంతనే.. చర్యలు తీసుకోవటానికి సంబంధించిన విధివిధానాల్ని పాటిస్తూనే.. అనవసరమైన రచ్చకు అవకాశం ఇవ్వకుండా ట్విటర్ కాస్తంత నేర్పుగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు జరుగుతున్న రచ్చ ఏమీ ఉండేది కాదు. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాలు అవసరం లేని రాజకీయ అలజడిని పెంచటానికి.. మోడీ సర్కారుకు లేనిపోని అపవాదు వేయటం మినహా మరింకేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఇష్యూను వీలైనంత త్వరగా క్లోజ్ చేయటం కాంగ్రెస్ కంటే కూడా ట్విటర్ కు మంచిదని చెప్పక తప్పదు.