ఏపీ రాజకీయాల్లో అందరూ ఊహించిన మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి పదవులకు తెలుగుదేశం నాయకులు సుజనా చౌదరి, అశోకగజపతిరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రదానిని కలిసి వారు తమ రాజీనామా పత్రాలు అందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న సాయంత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన తరువాత నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. నిన్న రాత్రి పొద్దు పోయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులూ కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగుతున్నారని ప్రకటించారు. ఈ ఉదయం నుంచీ ప్రధాని రాజస్థాన్ పర్యటనలో ఉండటంతో ఆయన అప్పాయింట్ మెంట్ తీసుకుని ప్రధాని నివాసానికి చేరారు. అనంతరం తమ రాజీనామాలు అందించారు. తమ రాజీనామాలను ప్రధానికి సమర్పించిన తమ రాజీనామాలకు దారి తీసిన కారణాలను వివరించారు.
కాగా, ప్రధాని నరేంద్రమోడీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. రాజస్థాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన చంద్రబాబుకు ఫోన్ చేసి దాదాపు పది నిముషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు తెలుగుదేశం మంత్రులు కేబినెట్ నుంచి వైదలగడానికి కారణాలను వివరించారు. రాజీనామా పత్రాలు సమర్పించేందుకు మోడీ అప్పాయింట్ మెంట్ కోసం సుజనా చౌదరి - అశోకగజపతి రాజులు ఢిల్లీలో వేచి చూస్తుండగా మోడీ చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడటం విశేషం.
ఇదిలాఉండగా..ఎన్డీఏ నుంచి వైదొలగడంపై టీడీపీ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. మంత్రి పదవులకు మాత్రమే గుడ్ బై చెప్పిన టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగే విషయంలో టీడీపీ ఆలోచన చేస్తుండటం చూస్తుంటే ఇంకా పూర్తిగా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని పలువురు వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా...టీడీపీ కేవలం మంత్రులను ఉపసంహరించుకుంటే సరిపోదని… ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇంత మోసం చేస్తుంటే… టీడీపీ కేంద్రంలో కొనసాగడం సరికాదన్నారు. కేంద్రంపై టీడీపీ వైఖరేంటో స్పష్టం చేయాలన్నారు. కేవలం మంత్రి పదవులకు మాత్రమే రాజీనామా చేయడం చూస్తుంటే సందేహాలు కలుగుతున్నాయన్నారు.