చిన్న ఫోన్ కాల్ : మోడీ బతిమాలినంత బిల్డప్!

Update: 2018-03-09 06:04 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియాలో తనకు అనుకూల ప్రచారం ఎలా రాగలదో.. ఆ ప్రకారం మాత్రమే వివరాల్ని లీక్ చేసి - వాస్తవాలను ట్యాంపర్ చేసి.. తాను తలచుకున్న విధంగా ప్రచారంలో పొందడంలో దిట్ట అని అందరూ అంటూ ఉంటారు. ఎంత చిన్న విషయాన్నయినా సరే.. ఆయన ఆ రకంగా ట్విస్టు చేయగల సమర్థులు అని అంతా అనుకుంటూ ఉంటారు.  తాజాగా కేంద్రం నుంచి తమ పార్టీకి చెందిన మంత్రులను రాజీనామా చేయించిన నేపథ్యంలో ప్రధాని మోడీ - బాబుతో ఫోనులో మాట్లాడడం జరిగింది. దానిని కూడా చంద్రబాబు చాలా చక్కగా తన ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆ ఫోన్ టాక్ కు సంబంధించిన ప్రచారం.. బాహ్య ప్రపంచంలో ఎలా నడుస్తున్నదంటే.. ఏదో మోడీ ఫోనుచేసి చంద్రబాబును బతిమాలుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

నిజానికి ప్రధాని నుంచి చంద్రబాబుకు ఫోను రావడం మాత్రం నిజం. ఆ ముందురోజు రాత్రి జైట్లీ ప్రకటన తర్వాత.. చంద్రబాబు ప్రధానితో మాట్లాడడానికి చాలా సార్లు ప్రయత్నించారు. జైట్లీ ప్రకటన అప్పటికే పూర్తియింది గనుక.. ఫోను సారాంశం ఏమి ఉండగలదో గ్రహించగలడు గనుక.. మోడీ స్పందించలేదు. ఆరాత్రే కటీఫ్ గురించి చంద్రబాబు ప్రకటించాడు. నిజానికి 24 గంటల తర్వాత మోడీ ఫోనులో ప్రతిస్పందించాడు. ఇంత జాగు చేయడమే.. ఆ కటీఫ్ గురించి ఆయన ఎంత తేలిగ్గా తీసుకున్నాడో చెప్పకనే చెబుతోంది.

చంద్రబాబును  - నరేంద్ర మోడీ ఏ రోజూ ఖాతరు చేయడం లేదనేది రాజకీయ వర్గాల్లో అందరూ అనుకునే సంగతి. జనవరిలో ఆయనకు అ పాయింట్ మెంట్ ఇచ్చినప్పుడు  కూడా.. భేటీలో చంద్రబాబు చెబుతున్న ప్రతిపాదనలు - వినతుల పట్ల మోడీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంతా అంటుంటారు. కానీ.. చంద్రబాబు మాత్రం.. రాష్ట్రం గురించి సకలం చెప్పేశాను.. సకలం పరిష్కారం అయిపోతున్నది అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నారు. ఆ ప్రెస్ మీట్ కబుర్లన్నీ కూడా ఉత్తివే అని అంతా అంటుంటారు.

కానీ అప్పటికంటె ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రజలు మోడీ స్పందన ఏమిటి అని ఎదురుచూడడం జరుగుతోంది. రాజీనామాలతోనే ఏదో భూమి బద్ధలైపోతుంది... అన్నట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. మరి మోడీ ఫోనులో ఏం మాట్లాడారో తెలిస్తే.. అది నిజమో కాదో అర్థమౌతుంది. అందుకే ఆయన మోడీ తనను బతిమిలాడారనే స్టయిల్లో మీడియాకు లీకులు ఇచ్చి... తానే ఆయన వినతుల్ని ధిక్కరించినట్లుగా రాయించుకుని.. మళ్లీ ప్రజల్ని మాయ చేయడానికి చూస్తున్నారని కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News