విదేశీ ప్రయాణాలు చేయటం ప్రధాని మోడీకి కొత్తేం కాదు. ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పదహారు నెలల కాలంలో ఆయన పలు విదేశీ పర్యటనలు చేపట్టారు. ఈ పదహారు నెలల కాలంలో ఒక్క అమెరికాలోనే ఆయన రెండో దఫా పర్యటిస్తున్నారు. మోడీ అమెరికాకు వెళ్లటం.. ఆ తర్వాత ఒబామా భారత్ కు రావటం.. తాజాగా మోడీ మళ్లీ అమెరికాకు వెళ్లటమే కాదు.. ఈసారి ఆయన సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
తన తాజా పర్యటనలతో అటు వివిధ దేశాధినేతలతో భేటీ కావటంతో పాటు.. దిగ్గజ సంస్థల సీఈవోలతో భేటీ కావటం.. ఈ సందర్భంగా ఆయన మాటలు.. విజన్ విపరీతమైన చర్చకు దారి తీస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మాకు స్థానం కల్పించండంటూ బతిమిలాడే ఒకనాటి భారత ప్రధానులకు భిన్నంగా.. ఇంకా జమానాలోనే ఉంటారా? డిజిటల్ యుగంలో మారరా? భారత్ మాత్రమే కాదు.. జర్మనీ.. జపాన్.. బ్రెజిల్ దేశాలకేం తక్కువ? వారికి ఎందుకు భద్రతా మండలిలో స్థానం కల్పించరన్న వాదనను సరికొత్తగా తెరపైకి తీసుకురావటమే కాదు.. ఈ విషయంపై డెడ్ లైన్ పెట్టుకొని పని చేయాలన్న సరికొత్త మాటను అంతర్జాతీయ వేదిక మీద చెప్పేశారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు.. జనాభా పరంగా.. ఆర్థికంగానూ.. ప్రజాస్వామ్యంగా దూసుకెళ్లే దేశాలకు భద్రతా మండలిలో చోటు ఎందుకు కల్పించరంటూ మిగిలిన దేశాల బాధ్యతను తానే మోస్తూ.. భారత్ ను ప్రమోట్ చేసిన తీరు రాజకీయ విశ్లేషకులతో పాటు..అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు సైతం మోడీ మీద ఓ లుక్కేసేలా చేసింది.
రాజకీయ కోణంలో మాత్రమే కాదు.. ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమై.. భారత్ లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి.. మరికొన్ని అంశాల గురించి చర్చించిన నేపథ్యంలో.. సదరు సంస్థల అధిపతులు మోడీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మోడీకి గ్లోబల్ విజన్ ఉందని.. ఆయనకు ప్రపంచ పరిణామాల మీద మంచి పట్టు ఉందని చెప్పటమే కాదు.. భారత్ ను మాత్రమే కాదు ప్రపంచాన్ని కూడా మోడీ మార్చేస్తారన్న మాటను చెప్పేస్తున్నారు.
ఇలాంటి మాటలు సాదాసీదా వ్యక్తులు కాకుండా సిస్కో సిస్టమ్స్ సీఈవో జాన్ చాంబర్స్ లాంటి వ్యక్తి పొగిడేయటం అంత చిన్న విషయం కాదు. ఆయనొక్కరే కాదు.. ఎడోబో సీఈవో కావొచ్చు.. గూగుల్.. మైక్రోసాఫ్ట్.. యాపిల్ సీఈవోలకు సైతం మోడీ మైకం కమ్మేసింది. మోడీ గురించి వారు భారీగా పొగిడేయటమే దీనికి నిదర్శనం. మోడీ తాజా అమెరికా పర్యటనతో ఆయనకు గ్లోబల్ లీడర్ ఇమేజ్ తెచ్చి పెట్టిందని చెప్పక తప్పదు. సగటు భారతీయుడికి అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది..?