స్వదేశంలో నరేంద్ర మోడీ మీద ఉన్న నమ్మకాలు నెమ్మదిగా సడలిపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. ఒక్క మేజిక్ తో మొత్తాన్ని మార్చేసే ఎత్తుగడ మోడీ పరివారానికి చాలా అవసరం. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల్లో కీలక భూమిక పోషించటం ద్వారా తిరుగులేని నాయకుడిగా కీర్తించుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా.. మోడీ మరోసారి చర్చనీయాంశంగా మారారు. మోడీ విదేశీ పర్యటనల సందర్భంగా మిగిలిన అంశాల మీద చర్చ జరిగినా లేకున్నా.. ఒక్క విషయం మీద మాత్రం చర్చ జరుగుతూ ఉంటుంది.
అదేమంటే.. ఇప్పటివరకు భారత్ కు ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారితో మోడీని పోల్చే కార్యక్రమం. అయితే.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమంటే.. గడిచిన 75 ఏళ్లలో భారత్ నెమ్మదిగా తనను తాను మార్చుకోవటంతో పాటు.. డెవలప్ మెంట్ విషయంలోనూ.. భారీ ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయటంలో తాము సాధించిన పురోగతిని మోడీ తనకు తగ్గట్లుగా మార్చుకోవటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇవాల్టి రోజున భారత్ ను విస్మరించే పరిస్థితి ప్రపంచానికి లేదు. సమయానికి తగ్గట్లుగా వ్యవహరించే విషయంలో ప్రధాని మోడీకి నూటికి నూరు మార్కులు పడతాయన్నది తెలిసిందే.
హిరోషిమాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. నిజానికి.. ఈ జీ7 కూటమిలో భారత్ భాగస్వామి కాదు. కేవలం ఈ సదస్సుకు ఆయన అతిధిగా మాత్రమే హాజరయ్యారు. అలా వెళ్లిన ఆయన.. అదరగొట్టేయటం కనిపిస్తుంది. ఈ సదస్సులో హైలెట్ అయిన పాయింట్స్లను చూస్తే.. వాటిల్లో ఎక్కువగా మోడీనే కనిపిస్తారు. అమెరికా అధ్యక్షుడు.. ఆస్ట్రేలియా ప్రధాని నోటి నుంచి వచ్చిన మాటలు మోడీ ఇమేజ్ ను మరింత పెంచటం ఒక ఎత్తు అయితే.. ఈ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన మోడీ.. ఐక్యరాజ్య సమితి మీద చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అదే సమయంలో రష్యా దాడితో విలవిలలాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడిని సైతం ఊరడిస్తూ.. యుద్ధ నివారణకు తాను వ్యక్తిగత స్థాయిలో ఏం చేయగలుగుతాయో దాన్ని చేస్తామన్న భరోసాను ఇవ్వటం చూసినప్పుడు.. గడిచిన తొమ్మిదేళ్లలో మోడీ తన ఇమేజ్ ను ఏ స్థాయికి పెంచుకున్నారన్న విషయం అర్థం కాక మానదు. ఇదంతా ఒక ఎత్తు అయితే పాపువా న్యూగినియా పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని ఏకంగా మోడీ కాళ్లకు పాదాభివందనం చేయటం ద్వారా.. మోడీ ఎంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.
ఈ మొత్తం సదస్సును చూస్తే.. మోడీ ఇమేజ్ మరింత భారీగా పెరగటం ఒకటైతే.. ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైన కూటమికి సైతం భారత్ సాయం.. అందునా మోడీ అవసరాన్ని ఈ సదస్సు చెప్పేసిందని చెప్పాలి. చైనాకు హెచ్చరికలు చేయటంతోపాటు.. దాన్ని నియంత్రించే బాధ్యతను మోడీ తలకెత్తుకున్నారని చెప్పాలి. భారత్ కు ఉండే సహజ గుణాన్ని ఆయుధంగా మార్చుకున్న మోడీ.. తనను తన చర్యలతోతరచూ ఇబ్బంది పెట్టే చైనాను ఇరుకున పడేయటంతో పాటు.. రష్యాతో తనకున్న సాన్నిహిత్యం ఏమిటి? ఎంతన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు.
ఒకరకంగా చెప్పాలంటే పశ్చిమదేశాలకు.. రష్యాకు మధ్య బీటలు వారిన బంధాన్ని పునరుద్ధరించే అంశం కంటే.. నష్టాన్ని పరిమిత స్థాయికి తీసుకురాగలిగిన సత్తా ఉన్నది భారత ప్రధాని మోడీకే అన్న విషయం తాజా సదస్సు చెప్పేసిందని చెప్పాలి. మోడీని అమితంగా ఆరాధించే వారికి ఈ టూర్ మర్చిపోలేని అనుభూతిగా మారితే.. మోడీ వ్యతిరేకులకు మాత్రం కంటగింపుగా మారిందని చెప్పక తప్పదు.