వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎం అయిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరింత కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఒకటి డిమాండ్ చేస్తే... మోదీ ఆ డిమాండ్ ను అసలు పట్టించుకున్నట్లుగానే కనిపించకపోగా... ఏకంగా సదరు డిమాండ్ ఇకపై ఏ ఒక్క రాష్ట్రం నుంచి వినిపించని రీతిలో మోదీ ఓ భారీ నిర్ణయం తీసుకున్నారు. అయితే సదరు విషయంలో అవినీతి లేకుండా చూసేందుకు జగన్ పడిన ఆరాటాన్ని మాత్రం తీర్చే దిశగా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం ఒక్కటే జగన్ కు ఊరట అని చెప్పవచ్చు. ఏపీతో పాటు యావత్తు దేశంలోనే అమితాసక్తి రేకెత్తిస్తున్న ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
జగన్ సీఎం కాగానే... టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లన్నీ అడ్డగోలుగా ఖరారయ్యాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా టీడీపీ నేతల జేబులు నింపుకునేందుకే అధిక ధరలకు విద్యుత్ ను ఆయా సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని కూడా జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో పీపీఏలను పున:సమీక్షిస్తానని కూడా జగన్ చెప్పారు. జగన్ నోట నుంచి వచ్చిన ఈ మాటలు ఇటు టీడీపీతో పాటు అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారును కూడా బాగానే ఇబ్బందిపెట్టాయని చెప్పాలి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని జగన్ కు కేంద్రం నుంచి పలుమార్లు వినతులు కూడా వచ్చాయి. అయినా జగన్ పెద్దగా వెనకడుగు వేయలేదు. ఈలోగా కరోనా మహమ్మారి విస్తృతి పెరగడంతో ఈ విషయం అటకెక్కిందన్న వాదనలు వినిపించాయి.
అయితే ఎంత కరోనా కలకలం రేగినా.. పీపీఏల అంశాన్ని మోదీ పక్కన పెట్టలేదనే చెప్పాలి. జగన్ చేసిన ప్రకటన అసలు తనకు వినిపించలేదన్నట్లుగానే వ్యవహరించిన మోదీ... మొత్తం పీపీఏలపై పెత్తనాన్ని రాష్ట్రాలకు లేని విధంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 2003 నాటి విద్యుత్ చట్టాన్ని మార్చడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి18, 1910న ఏర్పాటు చేసిన భారతీయ విద్యుత్ ఆక్ట్ -1910 (ఆక్ట్ నెం.9)ని బయటకు తీశారు. ఈ చట్టంతో రూపాంతరం చెందిన 2003 విద్యుత్తు చట్టంలో నిబంధనలు మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఓ కొత్త చట్టాన్ని కొంచెం గట్టిగా తీసుకు రాబోతున్నారు. మే8 వరకు అభ్యంతరాలు, సలహాలు చెప్పండంటూ ఓ నోటిఫికేషన్ కూడా ఈమేరకు జారీ అయింది. ఈ సవరణ చట్టం మేరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే, పీపీఏలకు కట్టుబడి ఉండాల్సిందే. పీపీఏల అమలును పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కంట్రాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది అమల్లోకి వస్తే పీపీఏల వ్యవహారమంతా కేంద్రం పరిధిలోకి వెళ్లినట్టే.
ఈ చట్టం ప్రకారం పవన, సౌర (పునరుత్పాదక) విద్యుత్తును ఒప్పందాల్లో ఉన్నట్టుగా కొనాల్సిందే. అలా కొనకపోతే యూనిట్ కు ఏకంగా 50 పైసల చొప్పున కరెంటు పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి డిస్కం ఏ సంవత్సరం లెక్కల్ని ఆ సంవత్సరమే తేల్చేయాలి. భారాన్ని వచ్చే సంవత్సరంలో వినియోగదారులకు వడ్డించటానికి వీల్లేదు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ, సర్కారు సబ్సిడీ కలిసి గృహ వినియోగదారులకు కొంత రిలీఫ్ ఇస్తున్నాయి. ప్రభుత్వమే డిస్కమ్స్ కు సబ్సిడీ చెల్లిస్తుంది. అయితే ఇకపై వంట గ్యాస్‌లో ఇస్తున్నట్టే… వాస్తవ కరెంటు ధరను మన దగ్గర వసూలు చేస్తారు. తరువాత కొంత సబ్సిడీని నేరుగా (బిల్లు మొత్తం, స్లాబు, కేటగిరీలను బట్టి) మన బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు. వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును భారీగా దుర్వినియోగం, సబ్సిడీ లెక్కల్లో ‘గోల్ మాల్’ జరుగుతుండటంతో మొత్తం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడతారు. ఆ లెక్కల్ని పక్కాగా రికార్డ్ చేస్తారు. పెద్ద పెద్ద ట్రాన్స్ మిషన్ లైన్స్, సబ్ స్టేషన్ల మెయింటెనెన్స్ ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తారు. ప్రాంతాల వారీగా కరెంటును పంపిణీ చేసే కంట్రాక్టులను ప్రైవేటు సంస్థలకు ఇస్తారు. ఇది కరెంటు రంగం రూపురేఖల్నే మార్చేయబోతున్నది.