రెండు తెలుగు రాష్ట్రాలు ... ఇటీవల కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుండడం.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంపై ప్రభావం పడడంతో రెండు తెలుగు రాష్ట్రాలు కొద్ది పాటి తేడా ఉన్నప్పటికీ.. ఆర్థికంగా మాత్రం సతమతం అవుతున్నాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీవ్రస్థాయిలో అప్పులు చేస్తున్నారు. దీంతో విపక్షాల నుంచి ఎదురుదాడిని తట్టుకోలేకపోతున్నాయి. అటు తెలంగాణ బీజేపీ.. కేసీఆర్‌ను వాయించి వదిలి పెడుతోంది.
దీనిని తప్పించుకునేందుకు కేసీఆర్ సర్కారు ఎదురుదాడి చేస్తోంది.బీజేపీ పాలిత యూపీ ప్రభుత్వాలు కూడా అప్పులు చేస్తున్నాయని ఇటీవలే ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. చెప్పుకొచ్చారు. అయినా.. విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇక, ఏపీ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిప్పులు చెరుగుతోంది. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం సాగుతోందని.. టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తల బొప్పికడుతున్న మాట వాస్తవం. దీంతో ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు రెండు తెలుగు రాష్ట్రాలను కరుణించారు. రెండు రాష్ట్రాలకు జనాభా దామాషా ప్రకారం.. నిధులు విడుదల చేశారు. తెలంగాణకు కేంద్రం నిధులు.. రూ.409.5 కోట్లు విడుదల చేయడం గమనార్హం. అదేవిధంగా ఏపీకి 581.7 కోట్లు విడుదల చేశారు. అయితే.. ఈ నిధులను నిర్దేశిత కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పడం గమనార్హం. అదేసమయంలో దేశవ్యాప్తంగా.. గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. గ్రామీణ స్థానిక రూ.13,385.70 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఏడాదికి ఇప్పటివరకు రూ.25,129.98 కోట్లు విడుదల చేయడం గమనార్హం. తెలంగాణకు ఈ పద్దు కింద రూ.409.5 కోట్లు దక్కగా.. ఇప్పటివరకు రూ.682.5 కోట్లు విడుదల చేసినట్టయింది. అదేసమయంలో ఏపీకి కూడా ఇప్పటివరకు రూ.969.50 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.,