ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్‌... !

Update: 2019-08-29 13:02 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వైఎస్సార్ పార్టీ  ప్ర‌భుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఇతోధికంగా ఆదుకుంటూనే ఉంది. ఇటీవ‌ల ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌తో వ‌రుస‌గా భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై మంత‌నాలు జ‌రిపారు. మంత‌నాల్లో భాగంగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కింద నిధులు పెండింగ్‌ లో ఉన్న‌ట్లు సీఎం జ‌గ‌న్ కేంద్ర మంత్రుల‌కు తెలిపారు. దీంతో ఎన్ని నిధులు పెండింగ్‌ లో ఉన్నాయి అని రాష్ట్రం నుంచి నివేదిక తెప్పించుకున్న త‌రువాతనే - జ‌గ‌న్ కోరిక మేరకు కేంద్ర ప్ర‌భుత్వం సానూకూలంగా స్పందించి ఇప్పుడు రాష్ట్రానికి రూ.1734 కోట్ల‌ను విడుద‌ల చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేంద్ర అట‌వీ శాఖ నుంచి కోట్ల రూపాయ‌ల పెండింగ్ నిధులు రావాల్సి ఉంద‌ట‌. ఈ పెండింగ్‌ లో ఉన్న నిధుల నుంచి ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం అట‌వీ శాఖ నుంచి రూ.1734కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ చెక్కును ఏపీ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డికి కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప్ర‌కాశ్ జావ‌డేక‌ర్ అంద‌జేశారు. ఏపీలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం వెచ్చించిన ఖ‌ర్చుల‌ను కేంద్రానికి నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా పెండింగ్‌ లో ఉన్న నిధుల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జావ‌డేక‌ర్ ఏపీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డికి తెలిపారట‌.

ఢిల్లీలో కేంద్ర‌ ప‌ర్యావ‌ర‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలో  అన్ని రాష్ట్రాల అట‌వీశాఖ మంత్రుల సమావేశం గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశం కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప్ర‌కాశ్ జావ‌డేక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగగా ఏపీ నుంచి రాష్ట్ర మంతి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల‌కు సంబంధించిన చెక్కును మంత్రికి అంద‌జేశాడు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జావ‌డేక‌ర్‌. భ‌విష్య‌త్‌ లో ప‌ర్యావ‌ర‌ణ ప‌నుల‌కు సంబంధించిన బిల్లుల‌ను వెంట‌నే చెల్లించేలా స‌హాక‌రించాల‌ని మంత్రి బాలినేని కేంద్ర‌మంత్రిని కోరార‌ట‌.


Tags:    

Similar News