వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ దినోత్సవానికి విశిష్ట అతిధిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి బోరిస్ తో ఫోన్లో మాట్లాడుతూ ఇన్వైట్ చేశారు. వెంటనే జాన్సన్ కూడా అంగీకరించేశారు. ప్రతి ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ దినోత్సవానికి విదేశాల నుండి ఓ ప్రముఖుడిని విశిష్ట అతిధిగా ఆహ్వానించే సంప్రదాయం మనకు చాలా కాలంగా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
తొందరలో జరగబోయే జీ-7 దేశాల సదస్సులో పాల్గొనాల్సిందిగా మోడిని ఆహ్వానించేందుకు బోరిస్ ఫోన్ చేశారు. బోరిస్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని రిపబ్లిక్ దినోత్సవానికి రావాలంటూ ఎదురు ఆహ్వానించారు. బోరిస్ మనదేశానికి అతిధిగా రావటం మంచి పరిణామమే అంటు విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే 1993లో అప్పటి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి జాన్ మేజర్ తర్వాత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ తరపున ఎవరు పాల్గొనలేదు.
ఒకవైపు సరిహద్దుల్లో చైనాతోను మరోవైపు పాకిస్ధాన్ తోను వివాదాలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి నేపధ్యంలో మనకు విదేశాల నుండి మద్దతు చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడి కూడా బోరిస్ ను ఆహ్వానించుంటారు. బోరిస్ కూడా సానుకూలంగా స్పందించటంతో రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింతగా దృఢమవుతాయని అనుకుంటున్నారు.