'వంద' అనే సంఖ్యకు విశేష గుర్తింపు ఉంటుంది. ప్రయోజనం కలిగించే ఏ విషయంలోనైనా వందవ స్థాయికి చేరిందంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. మరి సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ఆ సంబరం ఉండదా..! తప్పకుండా ఉంటుంది.
అందుకే ఆ కార్యక్రమం 'వంద' ఎపిసోడ్ పై మోడీ పెద్ద మనసు చాటుకున్నారు. అందుకోసం భారీ నిధులను కేటాయించారు. అంతేకాకుండా దానిని ఘనంగా నిర్వహించేందుకు అధికారులను ఆదేశించారు. ఇంతకీ 'వంద'పై మోడికి ఎందుకు ఇంట్రెస్టు పడింది. మోడీ ఫేవరేట్ అయిన ఆ కార్యక్రమం ఏది?
ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు మోడీ ఏర్పాటు చేసుకున్న ప్రముఖ కార్యక్రమం 'మన్ కీ బాత్'. ప్రతీ నెల చివరి ఆదివారం మోడీ తన పనులన్నీ పక్కన బెట్టి దేశ విశేషాలను ఆయన ప్రజలతో నేరుగా పంచుకుంటారు.
దేశంలో అప్పటి వరకు సాధించిన ఘనత, ప్రాచుర్యం పొందిన వ్యక్తులు, అవార్డులు, తదితర విశేషాలన్నీ ఈ కార్యక్రమంలో చెబుతూ ఉంటారు. నార్త్ లో ఈ కార్యక్రమం ఫుల్ ఫేమస్ అయిందనే చెప్పొచ్చు. అయితే సౌత్ లో బీజేపీ నాయకులు ప్రత్యేకంగా ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ కార్య్రమం త్వరలో 'వంద' ఎపిసోడ్ ప్రచారం కానుంది. ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ కార్యక్రమంల 'వంద' ఎపిసోడ్ ను ఘనంగా ప్రచారం చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు కొంత బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఈ వివరాలను చూసిన మోడీ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేశారు. ఆ నిధులు సుమారు రూ.100 కోట్ల రూపాయలు. మరి ఇన్ని కోట్ల రూపాయలతో ఏం చేస్తారు? అంతెందుకు ఖర్చు అవుతుందనే అనుమానం రావొచ్చు.
ఈ కార్యక్రమాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా అంటే సాదా సీదా టీవీల్లో కాదు.. ఏకంగా అమెరికా వైట్ హౌస్ లోనూ ప్రసారం అవుతుంది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి లోని జీ 20 సదస్సులోనూ దీనిని ప్లే చేయనున్నారు.
ఇలా మొత్తంగా 80 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లో మొత్తం 547 పార్లమెంట్ పరిధిల్లో పెద్ద స్క్రీన్లు వేసి ప్రసారం చేస్తారట. అందుకే మోడీ రూ.100 కోట్ల పై ఏమాత్రం ఆలోచించకుండా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 30న ప్రసారం కానుంది.