అగ్రరాజ్యం అమెరికా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన విజ్ఞప్తులను లైట్ తీసుకుంది. హెచ్-1బీ వీసాల విషయంలో ఉదారంగా వ్యవహరించాలంటూ అమెరికాకు ప్రధాని కోరాగా అగ్రరాజ్యం బేఖాతరు చేసింది. హెచ్-1బీ వీసాల జారీపై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కారు సత్వర జారీ (ప్రీమియం ప్రోసెసింగ్) ప్రక్రియను సస్పెండ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వీసాలు జారీ చేసే గెస్ట్ వర్కర్ కార్యక్రమం ఇప్పటికే పూర్తయినందున ఈ ప్రక్రియను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుందని భారత ప్రభుత్వం చేసిన వినతిని ఏ మాత్రం పట్టించుకోకుండా ట్రంప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం.
సాధారణ వీసాల జారీకి మూడు నుండి ఆర్నెల్ల వ్యవధి పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఛార్జీలకు అదనంగా 1,225 డాలర్ల చెల్లింపుతో ఈ ప్రీమియం వీసాను 15 రోజుల వ్యవధిలో ప్రోసెస్ చేసి జారీ చేస్తారు. భారత ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపిన కొద్ది గంటలకే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించటం విశేషం. విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ - వాణిజ్యశాఖ కార్యదర్శి రీటా తియోటియాతో కూడిన ప్రతినిధి బృందం ట్రంప్ కేబినెట్ సభ్యులు - చట్టసభల సభ్యులతో మాట్లాడుతూ హెచ్-1బి వీసాల వ్యవహారాన్ని వాణిజ్య - వ్యాపారపరమైన వ్యవహారంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ అమెరికన్ కంపెనీలను వెనక్కి తీసుకురావాలన్న ఉద్దేశం ట్రంప్ సర్కారుకు వుంటే అమెరికా ముందుగా మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తే బాగుండేదన్నారు. భారతీయ వృత్తినిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని, వారి ప్రవేశాన్ని అడ్డుకోవటం వల్ల అమెరికాలో ఉద్యోగాల కోసం పోరు మరింత తీవ్రమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా,అమెరికా ప్రయాణాలపై సరికొత్త నిషేధాజ్ఞలు నేడు వెలువడబోతున్నాయి. గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై వివాదం తలెత్తడంతో దానిలో కొన్ని సవరణలు చేసి ఈ నిషేధాజ్ఞలను రూపొందించినట్లు అమెరికన్ మీడియా చెప్తోంది. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశంపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సంతకం చేస్తారని మీడియా పేర్కొంది. జనవరి 27న జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాల వల్ల అమెరికాలోని విమానాశ్రయాల్లో గందరగోళం ఏర్పడటం, అమెరికా వెళ్ళాలనుకున్నవారు నానా అవస్థలు పడుతుండటం తెలిసిందే. ఈ ఆదేశాల అమలుకు తగిన గడువు ఇవ్వలేదు. ప్రజలను అప్రమత్తం చేయలేదు, అధికార వర్గాలను సమాయత్తం చేయలేదు. సవరించిన ఆదేశాలంటే ఏమిటో స్పష్టంగా తెలియడం లేదని మీడియా తెలిపింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ సవరించిన ట్రావెల్ బ్యాన్ పై సోమవారం సంతకం చేయబోతున్నట్లు మాత్రమే తెలిసిందని వివరించింది. సింగిల్ జడ్జి, అపీలు కోర్టు స్టే విధించడంతో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు నిలిచిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/