ప‌థ‌కాల‌కు ఫొటో వేస్తే.. మోడీ గెలిచేస్తారా?

Update: 2023-02-27 08:00 GMT
ఏపీలో ఇటీవ‌ల కాలంలో ప‌ర్య‌టిస్తున్న కేంద్ర మంత్రుల సంఖ్య పెరుగుతోంది. వివిధ కార్య‌క్ర‌మాల పేరుతో కేంద్ర మంత్రులు విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు కూడా వారు ప‌ర్య ట‌న‌లు చేస్తున్నారు.

వివిధ కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కూడా ప‌రిశీలిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ స‌మ‌స్య ఏంటంటే..కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై మోడీ ఫొటోలు వేయ‌డం లేద‌నేది!.

నిజానికి ఏ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చినా.. ఊరికేనే ఇవ్వ‌దు. ఆయా రాష్ట్రాల నుంచి వ‌చ్చిన జీఎస్టీ ప్రాతిప‌దిక‌న‌, 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార‌సుల మేర‌కు మాత్ర‌మే.. నిధుల‌ను బ‌ట్వాడా చేస్తుంది త‌ప్ప .. ఎలా బ‌డితే అలా ఇచ్చేస్తుంద‌నేది క‌ల్లో మాట‌. అలాంట‌ప్పుడు.. కేంద్రం నుంచి ప్ర‌త్యేకంగా నిధులు రాన ప్పుడు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటోతో ప‌నేంటి? అనేది రాజ‌కీయ నేతల మాట‌.

గ‌తంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు న‌రేంద్ర మోడీ కూడా ఇదే మాట అనేవారు. కేంద్రం నిధు లు ఊరికేనే ఇవ్వ‌డం లేద‌ని.. రాష్ట్రాల‌కు హ‌క్కుగా రావాల్సిన నిధుల‌ను మాత్రమే ఇస్తున్నార‌ని కూడా వ్యాఖ్యానించేవారు.

అయితే.. ఇప్పుడు కేంద్రంలో మోడీ పాల‌న జ‌రుగుతుండ‌డంతో వారే వీరు వీరే వారు అన్న‌ట్టుగా.. కావ‌డంతో కేంద్రం ఇప్పుడు ఏపీ వంటి రాష్ట్రాల‌పై ఫొటోలుపెట్ట‌డం లేదు..పూల‌దండ‌లు వేయ‌ట్లేదు.. అని కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అయినా.. ప‌థ‌కాల‌కు ఫొటో పెట్టినంత మాత్రాన‌.. పేరు చెప్పినంత మాత్రాన ఏపీ వంటి రాష్ట్రాల‌కు.. విభ‌జ‌న హామీలను అమ‌లు చేయ‌కుండా.. ఎన్ని చేసినా.. బీజేపీ ఓట్లు రాలే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Similar News