మిలియన్లు దాటేసిన మోదీ ట్విట్టర్ ఫాలోవర్లు !

Update: 2021-07-29 13:01 GMT
భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సోషల్ మీడియా లో ప్రధాని మోడీని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ట్విట్టర్‌కు క్రేజ్ ఎక్కువ. ప్రముఖులు చేసే పోస్టులకు అంతేస్థాయిలో స్పందన వస్తోంది. అయితే ప్రధాని మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 70 మిలియన్ మార్క్‌ ను చేరింది. ప్రపంచంలో  సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో క్రియాశీల రాజకీయ నేతల్లో ఒకరిగా ప్రధాని మోడీ నిలిచారు.

దేశ ప్రజలకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ వేదికగా మోదీ మంచి సందేశాలు షేర్ చేస్తుంటారు. ప్రభుత్వ పరమైన విషయాలే కాకుండా ఇతర అంశాలను కూడా పోస్ట్ చేస్తుంటారు. మోదీ ట్విట్టర్ ఖాతా గురించి తెలుసుకోవాలంటే.. 2009 గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోదీ ట్విట్టర్ ఖాతా తెరిచారు. 2010లో మోదీ ట్విట్టర్ ఖాతా లక్ష మంది పాలోవర్స్ ని సొంతం చేసుకుంది. 2011 నవంబర్ వచ్చేసరికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2014లో దేశ ప్రధాని అయిన తర్వాత సోషల్ మీడియాలో మోదీ పాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. దేశ ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకోవడంతోపాటు సందేశాలు, సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ట్విట్టర్ వేదికగా వివరిస్తూ వస్తున్నారు.

దేశ ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకోవడంతోపాటు సందేశాలు, సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ట్విట్టర్ వేదికగా వివరిస్తూ వస్తున్నారు. మోడీ తర్వాత పోప్‌ ఫ్రాన్సిస్‌ ట్విట్టర్‌ ఖాతాకు 53 మిలియన్ల మంది ఫాలొ అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కు 30.9 మిలియన్లు, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు 129.8 మిలియన్లు, ఫాలొవర్స్‌ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ కు 7.1 మిలియన్ల మంది ఫాలొవర్లు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్‌ షా కు 26.3 మిలియన్ల మంది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 19.4 మిలియన్ల ఫాలొవర్స్‌ ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్‌ యూఎస్‌ క్యాపిటల్‌ వద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు 88.7 మిలియన్స్‌ ఫాలొవర్లు ఉన్నారు.
Tags:    

Similar News