గత కొన్నేళ్లుగా తనకు వచ్చిన కానుకలు, మెమెంటోలను ఈ–వేలం వేస్తున్నామని అందులో పాల్గొని కొనుగోలు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ బహుమతులు అమ్మగా వచ్చిన డబ్బులన్నీ గంగానదిని ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. గత కొద్ది ఏళ్లుగా తనకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారన్నారు మోదీ. మన ఒలింపిక్ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు ఉపయోగించిన వస్తువులు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఇలా తన దగ్గరున్న అన్నింటినీ ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తున్నామని తెలిపారు. ఈ–వేలంలో అందరూ పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు వాటిని కొనుగోలు చేయవచ్చన్నారు.
గత కొద్ది ఏళ్లుగా నాకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారు. మన ఒలింపిక్ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు వాడిన వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని ఆన్‌లైన్ ద్వారా వేలం వేస్తున్నాం. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. ఈ–వేలంలో వచ్చిన డబ్బుల్ని గంగానది శుద్ధి చేయడానికి వినియోగిస్తాం’’ అని ప్రధాని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజుని పురస్కరించుకొని సెప్టెంబర్ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ కానుకలు వేలం వెయ్యడం మొదలు పెట్టింది. అక్టోబర్ 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ వేలంలో వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే http://pmmementos.gov.in అనే వెబ్ సైట్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చు.
ఒలింపిక్, పారా ఒలింపిక్‌లో భారత్ క్రీడాకారులకు వచ్చిన క్రీడాసామగ్రి, బహుమతులు వేలం వేస్తున్నట్టు చెప్పారు. క్రీష్ణానగర్, ఎస్ ఎల్ యతిరాజ్ బ్యాట్లు, నీరజ్ చోప్రా జావెలిన్, లవ్లీనా బోర్గోహైన్ కు చెందిన గ్లోవ్స్, తదితర మెమెంటోలు ఈ వేలంలో ఆకట్టుకుంటున్నట్టు చెప్పారు. తనకు వచ్చిన మెమెంటోలతోపాటు ఒలింపిక్ క్రీడాకారులకు వచ్చిన ప్రత్యేక మెమెంటోలు కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ వేలం వేస్తుందని తెలిపారు. ఇందులో ప్రధానంగా స్పోర్ట్స్ గేర్, పరికరాల రకాలు మరియు పతకం గెలుచుకున్న ఒలింపియన్‌ల నుండి బహుమతులు, చార్ ధామ్, అయోధ్య రామ మందిరం నమూనాలు ఉన్నాయి.ఒలింపిక్ విజేతలు అందుకున్న బహుమతులలో బంగారు పతక విజేత నీరజ్ చోప్రా మరియు సుమిత్ అంటిల్ ఉపయోగించిన జావెలిన్ తరువాత పివి సింధు బ్యాడ్మింటన్ రాకెట్ ఉన్నాయి. భారతీయ మహిళల హాకీ జట్టు సంతకంతో వున్నహాకీ స్టిక్ కూడా కలిగి ఉంది. వేలం మూడవ ఎడిషన్ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు వెబ్ పోర్టల్‌లో జరుగుతుంది. వస్తువుల ధర రూ .200 నుంచి ప్రారంభమై కోటి రూపాయల వరకు ఉంటుంది.