ఢిల్లీ ఎన్నికల ముందు వరకూ మోడీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా విమర్శలను ఎదుర్కొంది. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలే మార్పు తీసుకు వచ్చాయో ఏమో కానీ.. ఈ మధ్యకాలంలో చర్చిలపై దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా స్పందిస్తోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాడు. చర్చిలపై దాడులు చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని మోడీ పిలుపునిస్తున్నాడు.
పశ్చిమబెంగాల్‌లో ఇటీవల ఒక చర్చిపై దాడి జరిగి.. నన్‌పై దుండుగులు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దుర్మార్గపు సంఘటనపై మోడీ స్పందించారు. ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో తీసుకొంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కూడా ఆ రాష్ట్ర హోం శాఖ అధికారులను కోరినట్టుగా తెలుస్తోంది.
మరి ఇలాంటి సంఘటనలపై స్పందించడం స్వాగతించాల్సిన అంశమే. ఢిల్లీఎన్నికల ముందు ఢిల్లీ ప్రాంతంలోనే కొన్ని చర్చిలపై దాడులు జరిగాయి. అప్పట్లో క్రిస్టియన్ సంఘాల వాళ్లు వెళ్లి ఈ దాడుల గురించి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మొరపెట్టుకొన్నా.. సరిగా స్పందించలేదనే ఆరోపణలున్నాయి.
ఢిల్లీ ఎన్నికల తర్వాత మాత్రం పరిస్థితి మారింది. అప్ఘానిస్తాన్‌లో కిడ్నాపర్ల చెరలో ఉన్న ఒక క్రిస్టియన్ ఫాదర్ విడుదల కావడం విషయంలోనైనా. ఆ తర్వాత అక్కడక్కడ చర్చిలపై జరిగిన మతపరమైన దాడుల విషయంలోనైనా మోడీ వేగంగా స్పందించడం జరుగుతోంది. ఇదైతే ఆహ్వానించదగ్గ పరిణామమే!