ఏపీకి చాలా కాలం తరువాత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఆయన అల్లూరి 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అదే విధంగా విశాఖలో కూడా పర్యటిస్తారు. ఈ సందర్భంగా మోడీ జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల మీద కూడా దృష్టి పెడతారు అంటున్నారు.
ఈసారి మోడీ ఏపీకి వచ్చే సమయం చాలా కీలకమైనది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అటూ ఇటూ ఎన్డీయే, విపక్షాలు మోహరించి ఉన్న వేళ తులాభారంగా జగన్ పార్టీ మద్దతు అవసరం అవుతోంది.
జగన్ కి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఈ బలం ఉంటే చాలు బీజేపీ అభ్యర్ధి కళ్ళు మూసుకుని గెలుస్తారు. ఇక జగన్ బీజేపీకి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నా కూడా విపక్ష శిబిరం నుంచి కొత్త రాష్ట్రపతి వస్తారు. దీంతో జగన్ ఓటు కానీ మాట కానీ ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నది అన్నది అర్ధమవుతోంది.
ఇక జగన్ మద్దతు మీద ఎన్డీయే నేతలకు విశ్వాసం ఉన్నా కూడా ఆయన్ని మరింత దగ్గర తీసేందుకు హై లెవెల్ లోనే ఒక మంత్రాంగం రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు. ఇక ఏపీకి వస్తున్న మోడీ జగన్ తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు అని అంటున్నారు.
నిజానికి జగన్ ఎపుడు ఢిల్లీ వెళ్ళినా ప్రధాని కలవకుండా రారు కానీ ఏపీకి వస్తున్న మోడీ ఈసారి జగన్ తో సమావేశం కావాలనుకోవడమే కీలకమైన పరిణామం. జగన్ మీద ఇపుడు ఎన్నో వత్తిళ్ళు ఉన్నాయి. విపక్ష శిబిరం నుంచి కూడా మద్దతు కోరుతూ చాలా మంది బడా నేతలు, జాతీయ స్థాయిలోని బిగ్ షాట్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
దాంతో జగన్ని తుదివరకూ తమతోనే అట్టేబెట్టుకోవడం ఎన్డీయేకు చాలా అవసరంగా మారుతోంది. అందుకే ప్రధాని ఏపీ టూర్ లో జగన్ని స్వయంగా పిలిపించుకుని కీలకమైన మంతనాలు జరుపుతారు అని అంటున్నారు. మరి ఆ మంతనాలు ఏంటి అన్నది కూడా చర్చగానే ఉంది. అయితే సరిగ్గా ఇక్కడే జగన్ కూడా తన రాజకీయ చతురతను ఉపయోగించుకుని ఏపీకి ప్రయోజనం సమకూరేలా చూడాలని అంతా కోరుతున్నారు.
ఒక విధంగా జగన్ ప్రాధాన్యత ఇఉడు బాగా పెరిగిపోయింది. అంతా ఎవరి మటుకు వారు రెండు వైపులా ఉన్న శిబిరాలలో సర్దుకున్నారు. జగన్ న్యూట్రల్ గా ఉన్నా లేక ఒక పక్షం వైపునకు వచ్చినా కూడా మొత్తం సీన్ మారిపోతుంది. అందుకే జగన్ కి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక జగన్ మావాడే అని ధీమాగా ఉన్న బీజేపీ ఎప్పటికపుడు మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మరీ ఆయనను పూర్తిగా ఎన్డీయే శిబిరం వైపుగానే ఉండేలా చూడాలనుకుంటోంది.
ఇక ఈ నెలాఖరులో ఏపీకి అమిత్ షా వస్తారు అని అంటున్నారు. ఆయన కూడా జగన్ తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు అని తెలుస్తోంది. మొత్తానికి జగన్ ఎపుడూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దల అపాయింట్ల కోసం వేచి చూసేవారు. కానీ ఈసారి జగన్ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ పెద్దలు అంతా ఎదురుచూస్తున్నారు అంటే అదే అసలైన రాజకీయం. మరి ఇపుడు కాకపోతే మరెప్పుడూ ఇంతటి అనుకూల పరిస్థితి రాదు కాబట్టి జగన్ తాను ఏపీకి ఏమి కోరుకుంటున్నారో అన్నీ కూడా చేయడానికి కేంద్రాన్ని ఒప్పించుకోవాలని అంతా కోరుతున్నారు.