అప్పడు.. మోడీ టీ అడిగితే లడ్డూ ఇచ్చారంట

Update: 2015-09-01 05:16 GMT
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన కొన్ని గురుతులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాదు.. కొత్త సంగతులు తెలియజెప్పటంతో పాటు.. అప్పటి పరిస్థితులు.. ప్రజల భావోద్వేగాలు అర్థమయ్యేలా చేస్తాయి. తాజాగా ప్రధాని మోడీ నరేంద్ర మోడీ గతంలో జరిగిన ఒక ఘటన గురించి చెప్పుకొచ్చారు. అణుపరీక్షల సమయంలో దేశం ఎంత ఉద్వేగభరితంగా ఉండటమే కాదు.. నాటి ప్రజలు ఎంత భావోద్వేగానికి గురయ్యారో చాటి చెప్పే ఘటనగా చెప్పొచ్చు.

దేశ ప్రధానిగా వాజ్ పేయ్ వ్యవహరిస్తున్న సమయంలో పోఖ్రాన్ లో రహస్యంగా అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించటం.. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రధాని వెల్లడించటం తెలిసిందే. ఇప్పుడైతే మోడీ ప్రధాని కానీ.. పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాల బాధ్యుడిగా వ్యవహరించే వారు.

అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించిన విషయానికి సంబంధించిన వివరాలు వెల్లడించే సమయంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని కొండల్లో పర్యటిస్తున్నారంట. బాగా తిరిగి అలిసిపోయిన ఆయన.. ఆ రోజు సాయంత్రం ఒక టీ దుకాణానికి చేరుకొని.. టీ అడిగారంట. అయితే.. టీ దుకాణుదారు మాత్రం టీకి బదులుగా చేతికి లడ్డూ తినిపించాడట. ఎందుకని అడిగితే.. పోఖ్రాన్ లో అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించిన విషయం రేడియో వార్తల్లో చెప్పారని.. అది తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడట.

తనకు ఏ మాత్రం తెలీని సమాచారం.. ఒక సామాన్యుడు.. అది మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి తెలిసిందంటే.. అదంతా రేడియో పుణ్యమేనని చెప్పుకొచ్చారు. తాజా ఉదంతంలో మోడీ కష్టపడి పైకి వచ్చిన క్రమంతో పాటు.. అణుపరీక్షలపై దేశం యావత్తు ఎంత భావోద్వేగంగా ఊగిపోయిందన్న విషయం మోడీ మాటలు చెప్పకనే చెబుతున్నాయి కదూ.
Tags:    

Similar News