ద‌ళ‌ప‌తుల‌తో ప్ర‌ధాని భేటీ? చైనాకు గ‌ట్టి బ‌దులు ఇచ్చేందుకు భార‌త్‌ సిద్ధం

Update: 2020-07-03 17:30 GMT
లఢక్‌లో సరిహద్దు వివాదం నేప‌థ్యంలో చైనాకు గ‌ట్టి బ‌దులు ఇచ్చేందుకు భార‌త్ సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆకస్మి‌కంగా లఢక్‌లో ప‌ర్య‌టించారు. ఘ‌ర్ష‌ణ‌ల్లో మృతిచెందిన వీర సైనికుల‌కు మ‌రోసారి నివాళుల‌ర్పించి ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ పర్యటనతో చైనాకు ఒక గ‌ట్టి స‌మాధానం ఇచ్చిన‌ట్టుగా భార‌త్ భావిస్తోంది.

వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ లఢక్ పర్యటన చేయ‌డం.. అక్క‌డ లేహ్‌లో సమావేశం కావ‌డం అందులో భాగంగా తెలుస్తోంది. గాల్వన్ లోయ వద్ద చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలపై భార‌త్ ఆగ్ర‌హంగా ఉన్న విష‌యం తెలిసిందే. దీనిపై మూడు దశ‌లుగా చర్చలు చేస్తున్నా ఫలితాలు రాకపోవడంతో ప్రధానమంత్రి ఈ అనూహ్య ప‌ర్య‌ట‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణెలతో కలిసి లేహ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్యణ్యం జైశంకర్‌లతో ప్ర‌ధాన‌మంత్రి సమావేశమ‌వుతారని సమాచారం. ఈ భేటీలో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరవుతారని తెలుస్తోంది. త్రివిధ దళాధిపతులతో.. ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్, వాయుసేన చీఫ్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. ఇది అత్యున్నత స్థాయి సమావేశంగా భావిస్తున్నారు. స‌రిహద్దులో తదుపరి చర్యల కోసం ఈ స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో 14 కార్ప్స్ లెప్టినెంట్ కమాండర్‌తో లేహ్ చేరుకున్న వెంటనే ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ, బిపిన్ రావత్, నరవణె 14 కార్ప్స్ సైన్యాధికారులతో సమావేశమైన విష‌యం తెలిసిందే. ఫార్మర్డ్ పొజీషన్ నీమూ ప్రాంతంలో ఈ సమావేశం ఏర్పాటైంది. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా లెప్టినెంట్ కమాండర్ హర్వీందర్ సింగ్‌తో భేటీ అయ్యారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) లెప్టినెంట్ జనరల్ లియు లిన్‌తో ఇప్పటిదాకా మూడు దశలుగా భారత్ తరఫున చర్చకు ప్రాతినిథ్యం వహించింది హర్వీందర్ సింగ్‌. అందుకే అత‌డితో ప్రధానమంత్రి స‌మావేశ‌మై.. చైనాతో చ‌ర్చ‌ల విష‌య‌మై ప్ర‌ధాని హ‌ర్వీంద‌ర్ సింగ్‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. చైనా వైఖ‌రి ఏంటో తెలుసుకుని చైనాకు భారీ షాక్ ఇచ్చేలా భార‌త ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.
Tags:    

Similar News