ప్రధాని మోడీ టూర్ నిరసనలతోనే మొదలైంది. మోదీ ఈరోజు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో దిగారు. దిగడానికి ముందే తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి కార్మికులు నిరసనలతో హోరెత్తించారు. హైదరాబాద్ లోనూ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. గవర్నర్ తమిళి సై, బండి సంజయ్, ఈటల రాజేందర్, డా.లక్ష్మణ్ లు బీజేపీ తరుఫున స్వాగతం పలికారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం సన్మానం చేయవలసింది తెలంగాణ సీఎం కేసీఆర్. కానీ ఆయన హాజరు కాలేదు.
ప్రధాని మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని సికింద్రాబాద్ తిరుపతి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకికరణ పనులను ప్రధాని ప్రారంభించారు.
ఇక అనంతరం హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం బయలు దేరి వెళ్లారు. ఇక మధ్యాహ్నం ప్రధాని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీ హైదరాబాద్ పర్యటన, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారని పీఎంవో కు తెలిసినా వేదిక పై ప్రధాని పక్కనే సీఎం కేసీఆర్ కుర్చీని రిజర్వ్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా కుర్చీ కేటాయించడంతో ఆయన సమావేశానికి హాజరుఅవుతారా? లేదా? అన్నది వేచిచూడాలి.
ఇక హైదరాబాద్ లో మోడీకి వ్యతిరేకంగా పలు పోస్టర్లను బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి పై బీజేపీ, మోడీకి గుర్తు చేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి షాకిచ్చారు. బీజేపీ పై విరుచుకుపడుతూ బీఆర్ఎస్ హోర్డింగ్‌లు సంచలనమయ్యాయి. కుటుంబ పాలన, అవినీతి పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మోడీ తరచుగా టార్గెట్ చేస్తారు కాబట్టి, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ఈసారి ఆయన పర్యటనకు ముందే ఎదురుదాడికి దిగింది.
వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని శనివారం హైదరాబాద్ కు వస్తున్నారు. బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఆధునిక పనులను ప్రారంభించారు. దీని తర్వాత ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బీబీనగర్‌లో కొత్త బ్లాకులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రైల్వే , హైవే ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View
Full View Full View