ప్రధాని నరేంద్ర మోదీ దాదాపుగా ఆరు నెలల తర్వాత మొదటి విదేశీ పర్యటన చేయనున్నారు. ఈ సారి ఆయన అమెరికాకు వెళ్లనున్నారు. క్వాడ్ లీడర్ సమ్మిట్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం సెప్టెంబర్ 24, 2021నఅమెరికా వాషింగ్టన్ లో జరగనుంది. ప్రత్యేక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగాతో కాలిసి భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సు తరువాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనూ ప్రసంగిస్తారు.
నాలుగు దేశాల నాయకులకు ఆతిథ్యమిస్తున్న మొదటి వ్యక్తి క్వాడ్ శిఖరాగ్ర సమావేశం ఇది. మార్చిలో, జో బిడెన్ వర్చువల్ ఫార్మాట్ లో క్వాడ్ లీడర్ల మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. అనంతర ప్రస్తుతం ప్రత్యేక్షంగా ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. కరోనా పరిస్థితులలను సమీక్షించిన అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అమెరికాలోని మాడిసన్‌లో జరిగిన హౌడీ మోడీ సభలో పాల్గొన్న తరువాత, ప్రధాని అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆనాడు ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బైడెన్, మోదీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక కరోనా ప్రధాన ఎజెండాగా క్వాడ్ సదస్సు జరగనుంది.
వ్యాక్సినేషన్ తో పాటు సైబర్ భద్రత, సముద్ర జలాల భద్రత, వాతావరణ మార్పులు, విద్య, సాంకేతికత అంశాలపై క్వాడ్ నేతలు చర్చిస్తారు. ఆఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తాలిబన్ల పాలనతో ఎదురయ్యే సవాళ్లను చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. క్వాడ్ లీడర్స్ సమావశంలో అంతార్జాతీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సాంకేతికత సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, సైబర్ సెక్యూరిటీ, సముద్ర భద్రత, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, వాతావరణ మార్పు విద్యా, సమకాలిని సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ ప్రటించింది.
కరోనా పోరులో ఎలా ముందుకు వెళ్లాలి. ఇండో-పసిఫిక్ వ్యాపార అంశాలతో పాటు దేశాలమధ్య సత్సంబంధాలు నెలకొల్పడమే లక్ష్యంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. సెప్టెంబర్ 25న, న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్‌లో ఉన్నత స్థాయి విభాగం సాధారణ చర్చలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి జనరల్ డిబెట్ థీమ్ కోవిడ్19 నుంచి కోలుకోవడం, ప్రజల హక్కులను గౌరవించడం, ఐక్యరాజ్య సమితికి పునర్జీవనం కల్పించడం అంశాలతో సమావేశం జరుగనుంది.