'హర్ ఘర్ తిరంగా'పై మోదీ ట్వీట్: వైరల్

Update: 2022-07-22 10:30 GMT
భారతదేశానికి స్వాతంత్య్రం  వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇన్నేళ్లలో భారతావని ఎన్నో అడుగులు ముందుకు వేసింది. సాంకేతికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అయితే దేశంపై ఉన్న ప్రేమను కూడా చాటుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

అజాద్ కా అమృత్ వారోత్సవాల్లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంటే వచ్చే ఆగస్టు 11 నుంచి 17వ తేదీ వరకు దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరక అధికారులను ఆదేశించారు. దేశంలోని 20 కోట్ల ఇళ్లపై మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు.  1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్నిఆమోదించిన సందర్భంగా  తాజాగా ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణాలర్పించారు. వారి పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలిపేందుకు మూడు రంగుల జెండా ఎగురవేయాలన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఒక మైలురాయి కావాలని ఆకాంక్షించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. ఒకటో దశలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి పౌరులందరూ పాలుపంచుకునేలా చూడడం. రెండో దశలో జాతీయ జెండాలు సరిపోయే విధంగా తయారు చేయడం. మూడో దశలో అ పతాకాలను ప్రతి ఇంటిపై ఎగురవేసేలా చూడడం.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. జెండాల తయారీకీ ఆర్డర్లను ఇచ్చింది. జెండాలు కావాల్సిన వారు పోస్టాఫీసుల్లో ఆర్డర్లు పెట్టుకోవచ్చని తెలిపింది.

సోషల్ మీడియాను వాడేవారు తమ అకౌంట్లలో మూడు రంగుల జెండాను మార్చుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అడ్డవర్టయిజ్మెంట్లలో ‘హర్ ఘర్ తిరంగా’ ఇనిషియేటివ్ కు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియాలో లోకల్ చానెల్స్ ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని సూచించారు.

‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేసేందుకు ఏపీలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సమీర్ కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ విభాగంలు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో 90 లక్షల మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములు చేయనున్నారు. మహిళలు తిరంగా జెండాను ఇంటింటికి సమకూర్చేలా చర్యలు చేపట్టనున్నారు.
Tags:    

Similar News