అదేంటి అలీ.. గ్రౌండ్ లో ఇలాంటి పని చేయటమా?

Update: 2023-06-19 11:00 GMT
ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సీరిస్ లో భాగంగా తొలి టెస్టు లో ఆడుతున్న ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన అలీ తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. గ్రౌండ్ లో అంపైర్ల అనుమతి లేకుండా అతను ఒక స్ప్రేను ఉపయోగించటమే తాజా వివాదానికి కారణం. చేతుల ను పొడి గా ఉంచుకోవటం కోసం స్ప్రే వాడినట్లుగా చెబుతున్నారు. గడిచిన రెండేళ్ల వ్యవధి లో ఇలాంటి తప్పు చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

తాజాగా అతను చేసి పనికి అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత వేస్తూ ఫైన్ విధించారు. అంతేకాదు.. అతడి ఖాతా లో ఒక పాయింట్ వేసి.. తప్పుల చిట్టాను సిద్ధం చేశారు. రెండో రోజు ఆట లో బౌలింగ్ కు వచ్చే ముందు.. ఇన్నింగ్స్ 89వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద ఉన్న అలీ.. తన చేతుల్ని పొడి గా ఉంచుకోవటం కోసం స్ప్రేను ఉపయోగించాడు.

ఐసీసీ నియమావళి ప్రకారం.. అలీ ఉల్లంఘనల కు పాల్పడటం తో అతడికి తీరు ను తప్పు పడుతూ ఐసీసీ తాజాగా ఒక ప్రకటన ను విడుదల చేసింది. అయితే.. అలీ తన తప్పును ఒప్పుకోవటంతో అతడి పై విచారణ అవసరం లేదన్న ఐసీసీ.. అతడి తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్దమని పేర్కొన్నారు.

చేతుల్ని పొడిగా ఉంచుకోవటం కోసమే అలీ స్ప్రేను వాడాడ ని.. అంతకు మించి మరేం చేయలేదన్నారు. అతడు స్ప్రేను ఉపయోగించటం ద్వారా బంతి పై ఎలాంటి ప్రభావం పడలేదని మ్యాచ్ రిఫరీ స్పష్టం చేయటం గమనార్హం.

Similar News