సాటి మనిషిని అత్యంత కర్కసంగా.. కత్తితో గొంతును కోసేసే తీరును చూసి ప్రపంచం ఉలిక్కిపడింది. ముఖానికి నల్లటి ముసుగు ధరించి.. అమెరికన్ జర్నలిస్టులు.. బ్రిటీష్ సంఘ సేవకులు.. జపాన్ దేశీయుడు.. ఇలా తమకు వ్యతిరేకం అనిపించిన వారిని.. బంధీలుగా చేసుకున్న వారి పీకలు తెగ కోసే ముసుగు రాక్షసుడి ఆచూకీ ప్రపంచానికి తెలిసిపోయింది.
బ్రిటన్ మూలాలున్న ఇతగాడి పేరు మహ్మమద్ ఎమ్వాజీ.. రాక్షస సంతతికి చెందిన మనుషులగా భావించే ఇస్లామిక్ తీవ్రవాదులు మాత్రం ఇతగాడిని ముద్దుగా.. జీహాదీ జాన్ అని పిలుస్తుంటారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఇతగాడి ముఖం బయటకు వచ్చింది. ట్రక్కును పేల్చే ఘటనకు సంబంధించి విడుదల చేసిన 1.17 నిమిషాల వీడియోలో ఇతగాడు తన ముసుగు తొలగించి.. కెమేరా వంక తీక్షణంగా చూస్తూ.. తాను త్వరలోనే బ్రిటన్ కు వస్తానని.. అక్కడి వారి పీకల్ని కోసేస్తానంటూ చెప్పటం ఇప్పుడు సరికొత్త కలకం పుట్టిస్తోంది. ఇప్పటికే ఇతగాడిని ఎంతకైనా అంతమొందించాలని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. మరి.. ఈ అనాగరిక మనిషి తర్వాతి రోజుల్లో ఏం చేస్తాడో..?