కొందమంది అధినేతలకు అదృష్టమే అదృష్టం. అలాంటి అదృష్టం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలానే ఉందని చెప్పాలి. తెలుగు ప్రాంతాల్లో సుపరిచితులైన పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రాంతాలకు అతీతంగా పొగడ్తల్ని సొంతం చేసుకోవటం ఆయనకే సాధ్యమవుతుందని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. విభజన తర్వాత కానీ మరే ముఖ్యమంత్రికి రాని కాంప్లిమెంట్స్ కేసీఆర్ కు సొంతమయ్యాయి.
రాజకీయంగా తెలుగుదేశానికి వ్యతిరేకి అయిన కృష్ణ (సూపర్ స్టార్) కాంగ్రెస్ పక్షపాతి అన్న విషయం తెలిసిందే. కానీ.. ఆయన ఏ రోజున ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తేసింది లేదు. అలాంటి కృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ మధ్యన ఎంతలా పొగిడేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరిహారం కార్యక్రమం నేపథ్యంలో.. చరిత్ర పుస్తకాల్లో అశోకుడుచెట్లు నాటించెనని చదువుకున్నామని.. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి మొక్కలు నాటించటాన్ని చూస్తున్నామంటూ ఆయన పొగిడేశారు. కృష్ణ నోటి నుంచి ఈ స్థాయిలో పొగడ్త కేసీఆర్ కు మాత్రమే సొంతమైందని చెప్పాలి.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరో సినీ రంగ ప్రముఖుడు మంచు మోహన్ బాబు ఆకాశానికి ఎత్తేశారు. ఆయన నోటి నుంచి వచ్చిన పొగడ్తలు వింటే కేసీఆర్ ఆనందపడటం ఖాయమని చెప్పాలి. ఎందుకంటే ఆయన పొగడ్తలో ఉన్న పవర్ అలాంటిది మరి. ఎన్టీఆర్ కు వీరాభిమానిగా చెప్పే మోహన్ బాబు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎన్టీఆర్ తర్వాత అంతటివాడిగా పొగిడేశారు.
రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేయటంలో దివంగత ఎన్టీఆర్ తర్వాత ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమైన వారని ఆయన ముఖ్యమంత్రి కావటం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా వ్యాఖ్యానించారు. సినీ రంగ ప్రముఖులు ఇంతలా పొగడ్తలు సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాత్రం చెప్పక తప్పదు.