బాబు నోటి నుంచి నీతి మాట‌లు!

Update: 2019-07-16 14:30 GMT
ఎవ‌రు అవున‌న్నా..కాద‌న్నా.. తెలుగు నేల మీద రాజ‌కీయాల్ని అన్ని రూపాల్లో భ్ర‌ష్ఠుత్వం ప‌ట్టించిన ఘ‌నత ఎవ‌రికైనా చెల్లుతుందంటే అది ఏపీ విప‌క్ష నేత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే చెల్లుతుంది. అలా అని ఆయ‌న హ‌యాంలో అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని.. ఆయ‌న మంచి పాల‌కుడు కాద‌ని.. ఆయ‌న‌కు విజన్ అన్న‌ది లేద‌ని.. లాంటి గుడ్డి విమ‌ర్శ‌లు అస్స‌లు చేయ‌టం లేదు. ఒక సీఈవోకు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ.. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌కైనా దిగ‌జారే ల‌క్ష‌ణం బాబులో చాలా ఎక్కువ‌.

అవ‌స‌రానికి మించిన ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో పెద్ద ఎత్తున విప‌క్ష ఎమ్మెల్యేల్ని త‌న పార్టీలోకి అక్ర‌మంగా చేర్చుకున్న వైనం తెలిసిందే. బాబు చేసిన ప‌నికి దేవుడు త‌గిన శిక్ష వేశార‌న్న చందంగా.. తాను లాగేసిన 23 మంది ఎమ్మెల్యేల‌కు బ‌దులుగా తాజా ఎన్నిక‌ల్లో 23 మంది ఎమ్మెల్యేల్నే ఇవ్వటమే కాదు.. బాబు రాజ‌కీయ ప్ర‌యాణాన్ని నిశితంగా ప‌రిశీలిస్తే.. రాజ‌కీయాల్లో ఇప్ప‌టి వికారాల‌కు మూలం బాబే క‌నిపించ‌క మాన‌రు.

2014 ఎన్నిక‌ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. అసెంబ్లీ స‌మావేశాల్ని నిర్వ‌హించే విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించారో తెలిసిందే. అదే ప‌నిగి విప‌క్షంపై విరుచుకుప‌డ‌టం.. వారికి మైకు ఇచ్చేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం.. వారి మాట‌ల్ని అప‌హాస్యం చేయ‌టం.. ఎంత మాట ప‌డితే అంత మాట అనేయ‌టం తెలిసిందే.

నాడు అధికార‌ప‌క్ష నేత‌గా పెద్ద‌రికంతో వ్య‌వ‌హ‌రించి జ‌గ‌న్ చేసిన త‌ప్పుల్ని ఎత్తి చూపించిన వైనం స‌రిగా లేద‌న్న విమ‌ర్శ ఉంది. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన చంద్ర‌బాబు.. ఏ రోజు స‌భ‌ను హుందాగా న‌డిపించింది లేద‌న్న విమ‌ర్శ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా చంద్ర‌బాబు చేసిన‌ నీతి సుద్దులు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని చెప్పాలి. ప్ర‌తిప‌క్షంపై ఆరోప‌ణ‌ల‌కే స‌భా స‌మ‌యాన్నంతా అధికార‌ప‌క్షం దుర్వినియోగం చేస్తుంద‌న్నారు. అర్థం లేని అవినీతి ఆరోప‌ణ‌లతో విలువైన అసెంబ్లీ కాలాన్ని వృథా చేస్తున్న‌ట్లు త‌ప్పు ప‌ట్టారు. ఒక‌వేళ బాబు మాట‌లే నిజ‌మ‌నుకుంటే.. త‌న హ‌యాంలో అసెంబ్లీ నిర్వ‌హ‌ణ ఎలా సాగింది? అన్న‌ది చెక్ చేసుకుంటే బాగుంటుంది. అదేమీ లేకుండా బుర‌ద జ‌ల్ల‌ట‌మే ధ్యేయంగా పెట్టుకున్న చంద్ర‌బాబు నీతి మాట‌లు వింటే జ‌నాల‌కు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వటం ఖాయం. నీతులు చెప్పి అభాసు అయ్యే క‌న్నా కామ్ గా ఉండ‌టం మంచిదేమో బాబు?  కాస్త ఆలోచించుకోండి!
Tags:    

Similar News