ఆయనో గ్రామ సర్పంచ్.. గ్రామం కోసం ఉరికి ఉరికి పని చేశాడు. రాత్రనకా, పగలనకా ఆలోచన కూడా చేసే ఉంటాడు. ప్రగతి ప్రథంలో ఊరిని నడిపించడం కోసం తాను పడిన కష్టం ప్రస్తుతం అతడిని చీకటిలోకే నెట్టేసిందని చెప్పొచ్చు. గ్రామ ప్రగతి కోసం పని చేస్తే ప్రస్తుతం అతడి గతి సెక్యూరిటీ గార్డ్ స్థాయికి వచ్చింది. వివరాల్లోకెళితే..ఓ గ్రామ సర్పంచ్ పల్లె ప్రగతిలో భాగంగా ఊరిలో అభివృద్ధి పనుల కోసం అప్పులు తెచ్చాడు. బిల్లులు వచ్చాక చెల్లించి జీవించాలనుకున్నాడు. కానీ, బిల్లులు రాలేదు.
ఇక అప్పుల కుప్ప అలానే పెరిగిపోతూ వచ్చింది. చివరికి అతడికి కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో ఏం చేయాలో పాలుపోక సెక్యూరిటీ గార్డ్‌గా మారాడు అతడు. ఉదయం పూట సర్పంచ్‌గా ప్రజా సేవ చేస్తూనే.. రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా వర్క్ చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఆరెపల్లి గ్రామ సర్పంచ్ అతడు. ఈ ఊరి సర్పంచ్ పదవి అప్పట్లో ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో చాలామందే సర్పంచ్ పదవి కోసం బరిలోకి దిగారు. ఎక్కువమంది పోటీలో నిలవగా, గ్రామ పెద్దలు చీటీలు వేశారు. అందులో అదృష్టం కొద్ది ఇరుసు మల్లేష్ పేరు వచ్చింది. దీంతో అతడిని సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఆ సమయంలో సర్పంచ్ అవుతున్నందుకు మల్లేశ్ ఆనందించాడు. అయితే, సర్పంచ్ అయ్యేంతవరకు అంతా బానే ఉంది. కానీ, ఆ తర్వతే అసలు సిసలైన కష్టాలు మొదలైయ్యాయి. ‘పల్లె ప్రగతి’లో భాగంగా పనులు చేయాల్సి రాగా, ఎలాగూ బిల్లులు వస్తాయనే ధీమాతో సర్పంచ్ మల్లేష్ గ్రామంలో పనులు చేయించాడు. పనులు చేయించడం వరకు బానే ఉంది. కానీ, అందుకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మాత్రం అలానే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో చివరికి సర్పంచ్ మల్లేష్ అప్పుల పాలై తనకున్న రెండెకరాల్లో అర ఎకరం భూమిని అమ్ముకుని అప్పులన్నీ తీర్చేసే పరిస్థితి ఏర్పడింది. పల్లె ప్రగతి కాస్తా తన గతిని దీన స్థాయికి తీసుకొచ్చందని మల్లేష్ వాపోతున్నాడు.
ఈ క్రమంలోనే ఆర్థిక కష్టాలతో తన కుటుంబం గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఉదయం అంతా ఆరెపల్లి గ్రామంలో సర్పంచ్‌గా సేవలందిస్తూనే మల్లేష్ రాత్రుల్లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ టవర్స్‌లో నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, గతంలో ఆరెపల్లి గ్రామం బర్దీపూర్ విలేజ్‌లో కలిసుండేది. 2018లో ఆరెపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మల్లేష్ అక్కడ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. గ్రామ జనాభా 434 కాగా, గ్రామాభివృద్ధికిగాను ఎస్ఎఫ్‌సీ నిధులు రూ.37 వేలు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, మంజూరైన నిధులు గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు, కరెంటు బిల్లలుకే అయిపోతున్నాయని సర్పంచ్ మల్లేష్ పేర్కొంటున్నాడు.
గ్రామాభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదల విషయమై డిస్ట్రిక్ట్ కలెక్టర్‌ను పలు మార్లు సంప్రదించినట్లు సర్పంచ్ మల్లేష్ తెలిపాడు. అయితే, ఆ సమయంలో నిధులు ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చాడని, కానీ, ఆచరణలో ఒక్క రూపాయి కూడా రాలేదని మల్లేష్ పేర్కొన్నాడు. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా స్పందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు సర్పంచ్ మల్లేశ్ ఇరుసు.