ఐపీఎల్ 2021 వేలం : యువీ రికార్డ్ బ్రేక్ ..ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మోరిస్ !
సౌతాఫ్రికా ఆల్ రౌండర్ , స్టార్ క్రికెటర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ సీజన్ 2021 కోసం జరుగుతున్న మినీ వేలంలో సంచలనం సృష్టించాడు. ఏకంగా రూ.16.25 కోట్ల ధర పలికాడు. ఈ స్థాయిలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ ధర ఐపీఎల్ చరిత్రలోనే ధరపలకలేదు. గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ చరిత్రలో ఇదే భారీ మొత్తం కావడం గమనార్హం. క్రిస్ మోరిస్ గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
అయితే ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో అతడిని ఆర్సీబీ రిలీజ్ చేసింది. బేస్ ప్రైస్ రూ. 75 లక్షల నుంచి రూ. 16.25 లక్షల వరకు పలికిన మోరిస్‌ను చివరికి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇప్పటి వరకూ యువరాజ్ రూ.16 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడా రికార్డు కూడా మరుగున పడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఓ విదేశీ ప్లేయర్‌కు గతంలో రూ.15.5 కోట్లు మాత్రమే దక్కాయి. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్‌ను ఈ భారీ మొత్తానికి కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను మోరిస్ బ్రేక్ చేశాడు. యువరాజ్ సింగ్ తర్వాత రూ. 16 కోట్లు దాటిన రెండో ఆటగాడు ఇతడే.