అత్యవసరమైన వేళలో చప్పున గుర్తుకు వచ్చేది 108. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే కాదు.. వెనువెంటనే స్పందించే గుణం ఎక్కువ. అలాంటి అత్యవసర సేవలకు తాజాగా వస్తున్న కాల్స్ తో కాల్ సెంటర్ ఉద్యోగులు కిందామీదా పడిపోతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా వారికి వస్తున్న ఫోన్ కాల్స్ తో అక్కడి వారు తలలు పట్టుకుంటున్నారు. లాక్ డౌన్ వేళ మద్యం దుకాణాలు మూసివేయటంతో.. కిందా మీదా పడి పోతున్నారు మందుబాబులు. కొందరైతే ఇప్పటికే ఆత్మహత్యాయత్నాలు చేయగా.. మరికొందరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు.
లాక్ డౌన్ వేళ.. మద్యం దుకాణాలు మూసి ఉండటంతో తాము ఎదుర్కొంటున్న మానసిక సమస్యలతో పాటు.. తమకు ఎదురవుతున్న శారీరక ఇబ్బందుల గురించి 108 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వాపోతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు. లాక్ డౌన్ కు ఫోన్ చేసిన పలువురు మద్యం షాపుల్ని తెరవకపోతే తమకు మరణమే శరణ్యమంటున్నారు.
తక్షణమే మద్యం షాపులు తెరవాలని వేడుకుంటున్నారు. లాక్ డౌన్ వేళ.. మద్యం దొరక్క ఇబ్బంది పడుతున్న వారి మానసిక సమస్యలు తీర్చటం కోసం 108 కొత్త తరహా సేవల్ని షురూ చేసింది. దీంతో.. మందుబాబులు 108కు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మందుబాబుల కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు గడిచిన రెండు వారాలుగా పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని.. అవసరం లేకుంటే ఎవరూ రోడ్ల మీదకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. మందుబాబులకు ఎదురవుతున్న సమస్యల్ని పట్టించుకోవటం లేదు. దీంతో.. మద్యం దొరక్క కొందరు విలవిలలాడుతున్నారు. మరికొందరు అప్పోసొప్పో చేసి మరీ బ్లాక్ లో మద్యాన్ని కొనుగోలు చేసి అటు ఆరోగ్యాన్ని.. ఇటు జేబును ఖాళీ చేసుకుంటున్నారు. మద్యం ఒక్కసారిగా తాగటం మానేయటం అంత మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. మద్యానికి బానిసైన వారికి అది లభించకపోతే తీవ్రమైన మానసిక సమస్యలు ఏర్పడతాయని.. మూడు వారాల తర్వాత వారిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే 108కి ఫోన్ చేస్తున్న వారిలో పలువురు వెంటనే మద్యం దుకాణాలు తెరిచి.. తమను ఆదుకోవాలని ప్రాధేయపడటం గమనార్హం.