22 సెకన్ల ఈ వీడియో చూసినంతనే గుండెలు అదరటం ఖాయం

Update: 2022-08-14 23:30 GMT
గ్రేట్ ఎస్కేప్.. త్రుటిలో తప్పించుకోవటం లాంటివి ఒకేలాంటి అర్థంలోకి రావు కానీ.. ఒకే భావంలోకి తీసుకునే వీలుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే ఒళ్లు జలదరించటమే కాదు.. సుడి ఉంటే ఇలానే ఉంటుందన్న భావన కలుగక మానదు. కలలో కూడా ఊహించని రీతిలో ఒక తల్లి చేసిన సాహసం.. సెకన్లో వెయ్యో వంతులో ఆమె రియాక్టు అయిన తీరు ఈ వీడియోలో కనిపిస్తుంది. పెరిగిన సాంకేతికత కారణంగా సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయటం.. అందులో రికార్డు అయిన ఈ వీడియో చూసినంతనే హార్ట్ బీట్ ఒక్కసారి పెరిగిపోవటం ఖాయం.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందన్నది చూస్తే.. కర్ణాటకలోని మాండ్యలో రికార్డు అయిన ఈ సీసీ ఫుటేజ్ లో.. చిన్నారి ఇంటి నుంచి బయటకు వస్తుంటుంది. ఆమె వెనుకనే ఆమె తల్లి కూడా వస్తుంది. బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చే చిన్నారి.. ఇంటి మెట్ల చివరన ఉన్న పెద్ద నాగుపామును చూసుకోదు.. పొరపాటున తొక్కి.. రెండు అడుగులు వేస్తుంది. ఆమె వెనుకనే వస్తున్న తల్లి.. ఇది చూస్తుంది. మహా అయితే రెండు సెకన్ల వ్యవధిలో తల్లి వేగంగా స్పందించటం.. ఒక్క ఉదుటన ముందుకు వచ్చేసి.. చిన్నారిని పాము కాటును నుంచి తప్పించి.. ఆమెను ప్రొదివి పట్టుకొని పక్కకు తీసుకెళుతుంది. క్షణంలో వెయ్యో వంతు అన్నట్లుగా.. చిన్నారి చేతిని పట్టుకుని తల్లి వెనక్కి లాగడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా పడగ విప్పిన పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే అటవీ శాఖ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'వానాకాలంలో పాముల పట్ల జాగ్రత్తగా ఉండండి. కర్ణాటకలోని మాండ్యలో రికార్డు అయిన ఈ సీసీ ఫుటేజీని చూడండి. ఆ తల్లి ధైర్యానికి వందనాలు' అని పేర్కొన్నారు.

మొత్తం 22 సెకన్లు ఉండే ఈ వీడియోలో చివరి 12 సెకన్లు కీలకంగా చెప్పాలి. పిల్లల మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది.. అపాయంలో తమ బిడ్డ ఉంటే ఆ తల్లి ఎలా రియాక్టు అవుతుందన్న దానికి నిదర్శనంగా ఈ సీసీఫుటేజ్ నిలుస్తుంది. వర్షాకాలంలో పుట్టలు.. బొరియలు నీటితో నిండి ఉండటం.. దీంతో గ్రామాల్లోనూ.. ఊళ్ల శివారులోనూ పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వేళ.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏమైనా తన చిన్నారిని సేవ్ చేసిన విషయంలో ఈ అమ్మ నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యింది. ఈ వీడియోను చూసినంతనే.. ఒక్కసారిగా ఉలిక్కిపడే చందంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను విపరీతంగా చూడటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

https://twitter.com/i/status/1558432317525602304
Tags:    

Similar News