మోత్కుపల్లి నర్సింహులు....రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కరలేని పేరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓసారి మంత్రిగా పనిచేసిన రాజకీయ నేత....ఉమ్మడి ఏపీలో తెలంగాణ టీడీపీలో చక్రం తిప్పిన సీనియర్ పొలిటిషన్....ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగిన టీడీపీ వీర విధేయుడు....గవర్నర్ పదవికి అర్హుడిగా తమ పార్టీ అధినేత ఎంచుకున్న నేత....ఇదంతా గతం. ప్రస్తుతం మోత్కుపల్లికి గడ్డుకాలం నడుస్తోంది. తాడే పామై కరుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో టీడీపీ బహిష్కృత నేతగా మారారు. దీంతో, బాబుకు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేయడంతోపాటు ఏపీలో టీడీపీ గెలవకూడదని వెంకన్నకు మొక్కుకున్నారు మోత్కుపల్లి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలలో మోత్కుపల్లికి టికెట్ ఇచ్చేందుకు ఏ పార్టీ సుముఖంగా లేకపోవడంతో...ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్ ఎఫ్) రెడీగా ఉందని తెలుస్తోంది.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు....అన్న పాట రాజకీయాలకు బాగా సూటవుతుంది. పాలిటిక్స్ లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేం. టీడీపీకి కటీఫ్ చెప్పిన తర్వాత మరే పార్టీ నుంచి ఆహ్వానం అందక ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని మోత్కుపల్లి డిసైడ్ అయ్యారు. ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నానని కూడా ప్రకటించారు. ఆలేరులో ఆయన అనుచరగణం ప్రచారం కూడా చేస్తున్నారు.అయితే, అనూహ్యంగా మోత్కుపల్లికి బహుజన లెఫ్ట్ పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీఎల్ ఎఫ్ తరఫున బరిలో దిగే 29 మంది జాబితాలో ఆలేరు అభ్యర్థి పేరు లేదు. మోత్కుపల్లి ఒప్పుకుంటే బీఎల్ ఎఫ్ తరపున టికెట్ ఇస్తామని, ఆయనకు మద్దతిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రపోజల్ కు మోత్కుపల్లి ఓకే అంటారో లేదో అన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా మోత్కుపల్లికి బీఎల్ ఎఫ్ `లైఫ్` లైన్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.