మోత్కుపల్లి ఇప్పుడు ఆగం అయ్యారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీని నమ్మి ఉన్న ఆయనను చంద్రబాబు తీవ్ర మోసం చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే.. గవర్నర్ పదవి కాదు కదా.. కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. చంద్రబాబును నమ్మినందుకు తన జీవితం సర్వనాశనమైందని మోత్కుపల్లి నర్సింహులు వాపోయారు. చంద్రబాబు మీద కోపంతో కేసీఆర్ పాలన భేష్ అంటూ పొగిడేశాడు. కానీ పొగిడినా మోత్కుపల్లిని కేసీఆర్ దగ్గరకు రానీయలేదు.
టీడీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కనిపించినా అందరినీ గుంజేసిన కేసీఆర్.. మోత్కుపల్లి లాంటి దళిత, సీనియర్ నేతను పట్టించుకోకపోవడం గమనార్హం. మోత్కుపల్లి స్వయంకృతాపరాధమే ఇందుకు కారణమని గులాబీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. టీడీపీ లో ఉండగా మోత్కుపల్లి.. కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. అవి రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. ఎంతో అవమానకరమైన ఆ మాటలకు కేసీఆర్ బాధపడ్డారో.. లేక గుర్తుపెట్టుకున్నారో తెలియదు కానీ.. ఇప్పుడు మోత్కుపల్లి టీఆర్ ఎస్ లోకి వస్తానని అందరి నుంచి కబురు పంపుతున్నా కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదట. ఆ మధ్య వైసీపీ నేత విజయ సాయిరెడ్డితో మోత్కుపల్లి సమావేశమయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ తో కూడా చర్చించారు. దీంతో ఈ రెండు పార్టీల్లో చేరుతారని ప్రచారం జరిగింది. తెలంగాణ జనసేన పగ్గాలు మోత్కుపల్లివేనని అనుకున్నారంతా. కానీ ఏ పార్టీలోకి చేరలేదు.
ముందస్తు ఎన్నికల వేళ టీఆర్ ఎస్ లోకి దారులు మూసుకుపోయాయని అర్థం చేసుకున్న మోత్కుపల్లిని కాంగ్రెస్, బీజేపీ కూడా ఆదరించడం లేదట.. ఇంత సీనియర్ నేతను ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆలేరు నుంచి పోటీ చేసేందుకు మోత్కుపల్లి రెడీ అయినట్టు సమాచారం.
ఇలా చంద్రబాబు మోసంలో మోత్కుపల్లి బలైపోయారు. ఆయన అండ చూసుకొని కేసీఆర్ ను తిట్టినందుకు ఇప్పుడు గులాబీ పార్టీ తలుపులు మూసేసింది. ఫైర్ బ్రాండ్ అయిన మోత్కుపల్లిని కాంగ్రెస్ - బీజేపీ భరించేస్థితిలో లేవు. దీంతో బాబు కోసం మోత్కుపల్లి తన రాజకీయ జీవితాన్నే ఫణంగా పెట్టేశారని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.