ఈ మధ్య వచ్చిన పుష్ప సినిమా జాతీయ స్థాయిలోనే అదరగొట్టింది. పాన్ ఇండియా లెవెల్ లో ఊపేసింది. పుష్ప అంటే తగ్గేదేలే అని వెంటనే బిగ్ సౌండ్ వస్తుంది. అది సినిమా పుష్ప క్యారెక్టర్. సినిమా పుష్పను చూస్తే ఎర్ర చందనం దోచుకుని పంచుకునే వారు. బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునేవారు. సినిమా పుష్ప ఒక విధంగా రాబిన్ హుడ్ తరహా వ్యక్తిత్వంతో ఉంటాడు. దోచుకున్నా ఆ సొమ్మును పదిమందిని పంచడం సినిమా పుష్పకు తెలుసు. పేదల ఆకలి కూడా తెలుసు.
ఇక రియల్ పుష్పలు చాలా మంది చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో కనిపిస్తారు అని అంటుంటారు . వారు పెద్ద ఎత్తున ఎర్ర చందనాన్ని దోచుకుని పోతున్నా పట్టించునే నాధుడు లేడు అని కూడా అంటూ ఉంటారు . సినిమా పుష్ప వెనకా పోలీసు వ్యవస్థ మొత్తం పరుగులు తీస్తూంటే రియల్ పుష్ప వెనకాల రాజకీయ పలుకుబడి ఉండడంతో ఎవరూ టచ్ చేయడానికే వెనకడుగు వేసే సీన్ ఉందని అంటున్నారు.
గత ప్రభుత్వంలో చూసుకుంటే కనీసం ఎపుడో ఒకప్పుడు అయినా రియల్ పుష్పలను వెంటాడేవారు, వారి నుంచి దోచుకున్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని మీడియా ముందు పెట్టేవారు. ఇలా మీడియాలో ఎర్ర చందనం స్మగ్లర్లు దొరికారు అని వార్తలు వచ్చేవి. ఇపుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయినా రియల్ పుష్ప నుంచి ఒక్క ఎర్ర చందనం దుంగను సైతం తీసుకుని రాలేదు అనే టాక్ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది మరి ఇక్కడ కూడా తగ్గేదే లే అని అంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి ఎర్ర చందనం అక్రమ తరలింపు విచ్చలవిడిగా సాగుతోంది అనే ప్రచారం ఉంది . చిత్తూరు జిల్లాలో చూసుకుంటే ఈ స్మగ్లింగ్ భాగోతాలు అందరికీ తెలుసు. అయినా అటవీ అధికారులు కానీ పోలీసులు కానీ కనీసంగా కూడా ఆ వైపుగా చూడటం లేదా అని అంతా చర్చించుకుంటున్నారు.
ఈ మధ్యన ఒక భక్తుడు తిరుమల వెళ్తే అక్కడ ఆసక్తి కరంగా ఎర్రచందనడం పట్టుకున్నారు అనే వార్తలు గత ప్రభుత్వం లో వినిపించేవి ఇప్ప్పుడు వినిపిస్తున్నాయా అని అక్కడ వాళ్ళు గుర్తుచేశారు అంట . ఇదే విషయం గట్టిగానే మాట్లాడారని అంటున్నారు.
ఇక రియల్ పుష్ప ల వ్యవహారం తీసుకుంటే వాళ్లకు మించిన దర్జా పురుషుడు ఉండడని అంటున్నారు. ఒక వైపు రాజకీయ పలుబడి, మరో వైపు స్మగ్లర్ల అండ, ఇంకో వైపు అధికారులు చూసీ చూడనట్లుగా వదిలేయడం వల్ల ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎర్ర చందనం అక్రమంగా తరలించే పనిలో ఫుల్ బిజీగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు.
అంచెలంచెలుగా ఒక విష వ్యవస్థ ఎర్ర చందనం అక్రమ రవాణా చుట్టూ కమ్ముకుందని, దీని తీర లాగితే డొంక అంతా హై లెవెల్ లోనే ఉంటుందని అంటున్నారు. అటవీ శాఖ అయినా మరో శాఖ అయినా టచ్ చేయకపోవడానికి కారణం అంతా పూర్తిగా రాజకీయ కమ్ముకోవడం అని అంటున్నారు. అందువల్ల రియల్ పుష్ప తగ్గేదే లే అని మాటలతో చెప్పనవసరం లేదు చేతలతోనే అంతా చేసి చూపిస్తున్నారు అని అంటున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ ఈ విషయంలో నిమ్మళంగా ఉండడం వెనక కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకు ఇంతటి ఉదాశీనత అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇది జాతి సంపద, ఇది రాష్ట్ర సంపద. అసలే ఏపీ ఖజానా కు ఆదాయం లేకుండా అల్లాడుతోంది. ఆ పరిస్థితుల్లో పుష్లను పట్టుకుని చట్టానికి అప్పగించకుండా వారితోనే దోస్తీ చేస్తూ వారినే ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకునే వికృత మైన వ్యవస్థలో ఉండడమే రియల్ పుష్ప లకు అతి పెద్ద బలం అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప సినిమా తీసిన తరువాత ఎర్ర చందనం దొంగల మీద అందరి ఆలోచనలు చర్చలు మళ్ళుతున్నాయి.
ఇక సినిమా పుష్ప దోచుకున్న దానిని నలుగురికీ పంచుతూ ఎంతో కొంత న్యాయం చేస్తాడు. ఈ రియల్ పుష్ప ఆయన వెంట ఉండేవారిది అంతా అక్రమం, అన్నాయమే తప్ప పేద వారి ఆకలిని తీర్చే మనసు మర్యాద కనీసంగా లేవని అంటున్నారు. రియల్ పుష్ప ఎపుడు దొరుకుతాడు అన్నదే ఇపుడు అంతటా వినిపిస్తున్న ప్రశ్న. దీనికి జవాబు ఉందా అన్నది చూడాల్సిందే.